English | Telugu
బీజేపీపై మాయావతి సంచలన వ్యాఖ్యలు.. మతతత్వ పార్టీలతో జట్టుకట్టం
Updated : Nov 2, 2020
అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, సార్వత్రిక ఎన్నికల్లో గానీ బీజేపీతో తమ పార్టీ కూటమి కట్టే ప్రసక్తే లేదని మాయావతి స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీల సిద్ధాంతాల మధ్య తీవ్ర వైరుధ్యం ఉన్నందున జట్టుకట్టడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. తమది సర్వజన హితం కోరే పార్టీ అని, మతతత్వ పార్టీలతో స్నేహం చేయదని అన్నారు. కుల, మత, పెట్టుబడిదారీ సిద్ధాంతాలున్న వారితో బీఎస్పీ కూటమి కట్టడం జరగదు అని పేర్కొన్నారు. మతతత్వ పార్టీలపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, తాను ఎవరి ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని చెప్పారు. తాను అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కానీ అలాంటి పార్టీల కూటమిలో మాత్రం చేరబోనని మాయావతి స్పష్టం చేశారు.