English | Telugu
భర్తను హతమార్చాలకున్న భార్య...
Updated : Oct 3, 2019
ప్రస్తుతం ఉన్న సంబంధాలకు విలువ లేకుండా పోతుందని కొన్ని సంఘటనలు చూస్తుంటే మనకు నిజమే అనిపిస్తోంది.ప్రియుడితో తనను హతమార్చాలనుకున్న భార్య బండారాన్ని బయటపెట్టాడు భర్త ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. రజియాబేగం తన భర్త ఖాజా మొయినుద్దీన్ ను హత్య చేసేందుకు స్కెచ్ వేసింది. భర్త మిత్రుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది రజియాబేగం. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన మొయినుద్దీన్ తన హత్యకు కుట్ర జరుగుతోందని పసిగట్టాడు. భార్య ఆమె ప్రియుడు ఫొటోలు ఆడియోలు తీసి పోలీసుల ముందు పెట్టాడు.
తొమ్మిదో తారీకు పదకొండో నెల రెండు వేల పన్నెండులో పెళ్ళి అయ్యింది. వారికి పెళ్ళి అయ్యి ఇప్పటికి ఏడు సంవత్సరాలు అవుతుందని, అతనికి ఇద్దరు ఆడ పిల్లలని ఆ బాధితుడు తెలిపాడు. తన స్నేహితుడు బాజీ అనే అతను తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతను తెలియజేశాడు. తన భార్య తన స్నేహితుడు ఇద్దరు కలిసి తనని చంపటానికి ప్రయత్నించారని ఆ బాధితుడు పేర్కొన్నాడు. ఒకసారి కరెంట్ షాక్ ఇచ్చి చంపాలనుకున్నారని, మరొకసారి అన్నంలో విషం పెట్టి చంపాలనుకున్నారని అతను చెప్పడు. అతని ఆస్థికోసం ఇద్దరు కలిసి అతనిని చంపబోయారని అతను వాపోయాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.