English | Telugu
బావురుమంటున్న భాగ్యనగరం...
Updated : Apr 3, 2020
విపత్తు లెన్నింటికో ఎదురొడ్డి నిలిచిన కలం యోధుల కలాలూ కరోనా కరోనా అంటూ కలవర పడుతున్నాయి..ప్రతిరోజూ పాజిటివ్, నెగటివ్ కేసుల లెక్కలు రాసేసుకుంటున్నాయి..కాంక్రీట్ జంగిల్లో కానరాని జనసంచారం . అంతటా అలుముకుంది నిశ్శబ్ద వాతావరణం..ఆలు మగలు అందరూ ఇళ్లకే పరిమితం..కడిగిన చేతులనే కడిగేసుకుంటున్నారు. మొబైల్ ఫోన్లలో మునిగి తేలుతున్నారు.. చూసిన వాటినే టీవీల్లో చూసేసుకుంటున్నారు..ఇమ్యూనిటీ కోసం ఇష్టమైనవన్నీ తినేస్తున్నారు..మరచిపోయిన దేవుళ్లను మననం చేసుకుంటున్నారు..అయినా.. అందరికీ అదోరకం భయం..అదే.. కరోనా వచ్చి కాటేస్తుందనే కలవరం.. అందుకే మళ్లీ..
ఈ నగరానికి ఏమైంది? కాదు.. ఈ రాష్ట్రానికి ఏమైంది? కాదు కాదు.. ఈ దేశానికి ఏమైంది?కానేకాదు.. ఈ ప్రపంచానికి ఏమైంది? అని అడిగితే.. కరోనా ఓ శాపమై కూర్చుంది.. అయితే శాప విమోచనం అనేదీ ఉంటుంది..అయితే.. అదెప్పుడంటూ ఆశగా ఎదురు చూడడమే అందరి వంతయింది.