English | Telugu
బయోవార్ మధ్య జీవిస్తున్నాం! అప్రమత్తంగా వుండండి!
Updated : Mar 20, 2020
కరోనావైరస్ గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, అయితే జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. స్వీయ సంరక్షణే అత్యుత్తమ సంరక్షణ అని, ప్రజుల ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉన్నట్లు అని గవర్నర్ చెప్పారు. "కోవిడ్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని ఆమె భరోసా ఇచ్చారు.
తెలంగాణలో తాజాగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం వారిద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనితో మొత్తం తెలంగాణ లో పాజిటివ్ కేసుల సంఖ్య 18కు చేరుకుంది. వీరిలో ఒకరు ఇప్పటికే డిశ్చార్జి కాగా.. మరో 17 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ లో ఉన్న కరోనా బాధితుల్లో ఏకంగా 9 మంది విదేశీయులు ఉండడం గమనార్హం.
గవర్నర్‌కి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లు రాజ్‌భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన సలహా ను దృష్టిలో పెట్టుకొని రాజ్‌భవన్ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తిరిగి ఎప్పుడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశాలు మొదలయ్యేదీ ప్రస్తుతానికి చెప్పలేదు. కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే రాజ్‌భవన్ వర్గాలు నెక్ట్స్ సమావేశాల తేదీలు నిర్ణయించనున్నారు.