కన్నా వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీ జె పీ నేతలకు ఎదురు ఛాలెంజ్ విసిరారు. తానూ ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, కాణిపాకమే కాదు.. వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని ప్రకటించారు. అవినీతికి పాల్పడలేదని కన్నా, సుజనా చౌదరి ప్రమాణం చేస్తారా, అంటూ ఎదురు ఛాలెంజ్ చేశారు. సుజనాచౌదరి.. బోగస్ కంపెనీలు సృష్టించి.. వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారని, కన్నా లక్ష్మీనారాయణ ఓ అవినీతిపరుడు, నేను మళ్లీ చెబుతున్నా.. రూ.20 కోట్లకు కన్నా అమ్ముడుపోయారంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కన్నా లాంటివాళ్లు.. ప్రశ్నించేందుకు అనర్హులు అంటూ కూడా వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకు పడ్డారు.