English | Telugu
కరోనాతో మరణించిన వారి మృతదేహాలను గోతిలో విసిరేసి పూడ్చి పెట్టారు
Updated : Jul 1, 2020
బళ్లారి లోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ గత రెండు రోజులలో 18 మంది మరణించారు. ఐతే ఆ మృత దేహాలకు అంత్యక్రియల పై స్థానికులు అభ్యతరం చెప్పడంతో అధికారులే అంత్యక్రియలు పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనికోసం గుగ్గరహట్టి లోని తుంగభద్ర ఎగువ కాల్వ కు కొద్దీ దూరంలో ప్రొక్లైన్ తో రెండు పెద్ద గోతులు తీసి ఉంచగా పిపియి కిట్లు ధరించిన ప్రభుత్వ సిబ్బంది నల్లటి ప్లాస్టిక్ బ్యాగులలోచుట్టిన మృతదేహాలను తీసుకు వచ్చి ఒక గోతిలో 8 మరో గోతిలో 10 మృతదేహాలను విసిరేసి పూడ్చి పెట్టారు. ఈ వీడియోలో ఉన్న వారి సంభాషణలు కూడా దారుణంగా ఉండడంతో ఈ వ్యవహారం పై నెటిజన్లు మండి పడుతున్నారు. ఐతే వైరల్ అవుతున్న ఈ వీడియోల పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో బళ్లారి జిల్లా కలెక్టర్ స్పందించారు. కరోనా వైరస్ తో చనిపోయిన వారికి జరిగిన అంత్యక్రియల తీరు పై మృతుల బంధువులకు అయన బహిరంగ క్షమాపణ చెప్పారు. దీని పై విచారణకు ఆదేశించామని తప్పు చేసినట్లుగా తేలిన వారి పై చర్యలు తీసుకుంటామని అయన చెప్పారు. ఐతే ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితి కేవలం విదేశాలలోనే చూశాం. ఐతే ఇపుడు వచ్చిన ఈ వీడియోతో మన దేశం లోని పరిస్థితుల పై ప్రజలలో ఆందోళన నెలకొంది.