English | Telugu
ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్.. మరో నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
Updated : Oct 2, 2020
ట్రంప్ ప్రధాన సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ వచ్చిన కొన్ని గంటల్లోనే.. అధ్యక్ష దంపతులకు కూడా కరోనా నిర్ధారణ అయింది. అధ్యక్షుడు ట్రంప్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటే హోప్ హిక్స్ ఉంటారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్‌తో పాటు తరచుగా ఆమె ప్రయాణాలు చేస్తుంటారు. హోప్ హిక్స్ తో కలిసి ఇటీవలే ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె నుంచే ట్రంప్‌కు వైరస్ సంక్రమించి ఉంటుందని వైట్ హౌస్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేశారు.
అమెరికా ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న ప్రస్తుత సమయంలో ట్రంప్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి మాస్క్ ధరించడానికి నిరాకరిస్తున్న ట్రంప్ కు కరోనా సోకడం పై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.