English | Telugu
ఏపీలో అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్ విడుదల
Updated : Oct 9, 2020
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా తాజా మార్గదర్శకాలు వెల్లడించింది. సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. మాస్క్ లేకుంటే షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్‌లో ప్రవేశం నిరాకరించాలని తెలిపింది. విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
- సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద శానిటైజర్లు తప్పనిసరి. మాస్కు లేనివారికి ప్రవేశం నిషేధం.
- సినిమా థియేటర్లలో మాస్కు ధరించటం, శానిటైజేషన్, భౌతిక దూరానికి సంబంధించి ప్రచార ప్రకటనలు వేయాలి.
- రద్దీగా ఉండే ప్రదేశాల్లో విధిగా భౌతికదూరం పాటించాలి.
- కోవిడ్ నిబంధనల అమలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి.
- ప్రార్థనా మందిరాల్లో కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి.
- బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మైకుల ద్వారా మాస్కు ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవటం, భౌతిక దూరం పాటించటం వంటి వాటిపై మైకుల ద్వారా ప్రచారం.
- స్కూళ్లు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లో కేంద్రం మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి.
- పాఠశాలల్లో ప్రతి పీరియడ్ తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు శానిటైజేషన్ చేసుకోవాలి.