English | Telugu
కరోనా తోనే సతమతమౌతుంటే.. కొత్తగా ప్రమాదకర న్యుమోనియా..!
Updated : Jul 10, 2020
గ్లోబల్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం కజఖ్‌స్థాన్‌లో గుర్తుతెలియని న్యుమోనియాతో ఈ సంవత్సరం లో ఇప్పటివరకు 1,772 మంది మరణించారు. గడచిన జూన్ నెలలోనే 628 మంది చనిపోయారు. ఈ చనిపోయిన వారిలో చైనా వారు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఈ వివరాలను కజఖ్‌స్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం వీచాట్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కజఖ్‌స్థాన్‌లోని షిమ్కెంట్, అతిరో, అక్టోబ్ నగరాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని ఆ పత్రిక తెలిపింది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇది కరోనావైరస్ కంటే ప్రమాదకరమని, దీనిలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని తెలిపింది. ఐతే చైనా మీడియాలో వచ్చిన ఈ వార్తలను కజఖ్‌స్థాన్ వైద్యఆరోగ్యశాఖ తీవ్రంగా ఖండించింది. మా దేశంలో కొత్త న్యూమోనియా వచ్చిందన్న వార్తలు నిరాధారమైనవని అవి కేవలం తప్పుడు కథనాలు అని కొట్టిపారేసింది. ఇది కేవలం సాధారణ న్యుమోనియాగా మాత్రమేనని ఐతే గత ఏడాది జూన్‌తో పోల్చితే ఈ సంవత్సరం న్యూమోనియా కేసులు ఎక్కువగా నమోదయ్యాయని అక్కడి ప్రముఖ న్యూస్ ఏజన్సీ కజిన్‌ఫామ్ తెలిపింది.