English | Telugu
కేబినెట్ స్పెల్లింగ్ తెలీదు కానీ సీఎం అభ్యర్థి అట.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు
Updated : Oct 31, 2020
తేజస్వి తండ్రి ఒకప్పటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తన తొలి కేబినెట్ సమావేశంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని... దీనికోసం ప్రజల దగ్గర నుండి డబ్బులు కూడా వసూలు చేశారని... అయితే, అప్పటి ఆ అప్లికేషన్లన్నీ ఇప్పటికీ డస్ట్ బిన్ లోనే ఉన్నాయని అశ్వినీ చౌబే తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతేకాకుండా... జేడీయూ, కాంగ్రెస్ కూటమిని "గప్పు - పప్పు" అని ఎద్దేవా చేశారు. ఈ గప్పు-పప్పుల కూటమి ప్రజలకు నెరవేర్చలేని తప్పుడు హామీలను ఇస్తుందని, ప్రజలు ఈ నాయకుల పట్ల చాల జాగ్రత్తగా ఉండాలని అయన అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన వసతులను కల్పించినప్పుడే దాన్ని మంచి పాలన అంటారని... లేకపోతే అది దోపిడీ ప్రభుత్వం అవుతుందని అయన తెలిపారు.
ఇది ఇలా ఉండగా మొన్న జరిగిన మొదటి విడత పోలింగ్ లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనాలు ఉన్న నేపథ్యంలో జెడియూ, బీజేపీ కూటమి తేజస్వి యాదవ్ ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయని తెలుస్తోంది. ఎలాగైనా మిగిలిన విడతల ఎన్నికలలో మెజారిటీ సాధించేందుకు ఆ పార్టీలు ఈ విధంగా తమ ప్రత్యర్థిని టార్గెట్ చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.