English | Telugu
లొంగదీసుకొని కడుపు చేశాడు! టీఆర్ఎస్ నేత అరాచకం!
Updated : Mar 3, 2020
గుట్టుగా ఉంచితే 6 లక్షలు ఇస్తాడట!
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. ఆమెను అదే గ్రామానికి చెందిన ఓ టీఆర్‌ఎస్ నాయకుడు లొంగదీసుకున్నాడు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో త్వరగానే ఆ యువతి తల్లిదండ్రులకు దగ్గరయ్యాడు. మెల్లగా యువతిని కూడా లోబర్చుకున్నాడు. ఉన్నట్టుండి ఆ యువతి కనపడకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తర్వాత రెండు రోజులకు ఆ మహిళ తనంత తానుగా తిరిగి ఇంటికి వచ్చింది. ఎక్కడికి వెళ్లావని తల్లిదండ్రులు ప్రశ్నించగా సదరు టీఆర్‌ఎస్ నాయకుడు చేసిన బాగోతాన్ని తల్లిదండ్రులకు చెప్పి భోరుమంది. ఆమె తల్లిదండ్రులు నేతపై ఒత్తిడి చేశారు. అయినా స్పందించలేదు. అయితే ఇప్పుడామె గర్భవతి అయింది. విషయం తెలుసుకున్న సదరు టీఆర్‌ఎస్ నాయకుడు ఈ విషయాన్ని గుట్టుగా వుంచమని 6 లక్షల రూపాయలిస్తానని కాళ్ళబేరానికి వచ్చాడు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ సంఘట స్థానికంగా సంచలనం సృష్టించింది.