English | Telugu
మారుమొగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలు...
Updated : Oct 4, 2019
సూర్యపేట జిల్లాకి చెందిన హుజూర్ నగర్ నిన్న మెన్నటి దాకా ఎవరికి తెలీదు. కానీ హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికార, ప్రతి పక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమం లోనే ఉప ఎన్నికల పరిణామాలు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి. మొత్తం డెబ్బై ఆరు మంది నామినేషన్ వేయగా అందులో నలభై ఐదు మంది అభ్యర్థుల పత్రాలు సరిగా లేవంటూ నామినేషన్ లు తిరస్కరించింది ఈసి. దీంతో ముప్పై ఒక్క మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే తాజాగా మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఫైనల్ గా ఇరవై ఎనిమిది మంది అభ్యర్ధులు తుదిపోరులో నిలిచారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆటో, ట్రక్ గుర్తులను డిలీట్ చేస్తూ నోటీసు బోర్డులో ఉంచారు. మొత్తం డెబ్బై నుంచి ఎనభై గుర్తులను డిస్ ప్లే చేశారు. పదమూడు మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉండగా మిగిలిన పదిహేను మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. సీపీఐ, టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. టీజేఎస్, కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. టిడిపి, బిజెపి ఒంటరిగా బరిలోకి దిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇక సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో భైపోల్ లో కామ్రెడ్ లు పోటీకి దూరమయ్యారు.హుజూర్ నగర్ ఉప ఎన్నికల పై ప్రధానం చూపుతూ చంద్రబాబు సైతం నేరుగా బరిలోకి దిగడానికి సిద్దం అయినట్లు సమాచారం. ఇప్పుడు ఈ ఎన్నికల విషయం రాష్ట్రామంతా హాట్ టాపిక్ గా హల్ చల్ చేస్తోంది.