English | Telugu

తమిళనాడు లో దారుణం

తమిళనాడులో 34 ఏళ్ల ఓ వ్యక్తి కలకలం రేపాడు. ఇటీవల అతడు విదేశాల నుంచి రావడంతో అతడిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే, అతడు పిచ్చి పట్టినట్లు ప్రవర్తించి ఓ వృద్ధురాలి (90) మరణానికి కారణమయ్యాడు. శ్రీలంక నుంచి తమిళనాడులోని థేని జిల్లాకు అతడు వచ్చాడు. గత రాత్రి హోం క్వారంటైన్‌ను ఉల్లంఘించి బయటకు వచ్చాడు. ఆరు బయట నిద్రిస్తున్న వృద్ధురాలి వద్దకు వెళ్లి దాడి చేసి, ఆమె గొంతు కొరికాడు. దీంతో ఆమె కేకలు వేసింది.. దీంతో స్థానికులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. ఆ ప్రాంత వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.