English | Telugu
నిండు కుండల్ని తలపిస్తున్న ఏడు కొండల్లోని జలాశయాలు
Updated : Dec 5, 2019
తిరుమలలో జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మూడు ప్రాజెక్టులు పూర్తిగా నిండుకున్నాయి. మరో రెండు జలాశయాల్లోకి 70% శాతం నీరు చేరుకుంది. కుమారధార, పసుపుధార, ఆకాశగంగ జలాశయాలు జలకళ ఉట్టిపడుతోంది. కుమార, పసుపుధార జలాశయాల నుంచి వృథాగా వెళ్తున్న నీటిని పాపవినాశనం డ్యామ్ లోకి పంపిని చేస్తొంది టీటీడీ. మరోవైపు ఆకాశగంగ నుంచి పాపవినాశనం డ్యామ్ లోకి నీటిని విడుదల చేస్తున్నారు. తిరుమలలో ఏడాదికి సరిపడినంత నీటి నిలువలుంటాయని చెబుతున్నారు అధికారులు. తిరుమల నీటి అవసరాల కోసం నిత్యం పది లక్షల గ్యాలన్ల నీటినీ తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి తరలిస్తారు. ప్రస్తుతం కళ్యాణి డ్యాంలో 30% శాతం నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో తెలుగు గంగ ద్వారా వచ్చే నీటిని తిరుమలకు తరలిస్తున్నారు. మొత్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో శ్రీ వారి సన్నిధిలో నీటి కష్టాలు తీరినట్టేనంటోంది టిటిడి.