English | Telugu

ది రాజాసాబ్ టీజర్ వచ్చేసింది..కాకపోతే తాత వైరు కొరికేసాడేమో చూడండి ఫ్యాన్స్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab). హర్రర్ ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్(Prabhas)చాలా ఏళ్ళ తర్వాత వింటేజ్ లుక్ తో కనిపిస్తుండటంతో పాటు, ఎంటర్ టైన్ మెంట్ ని కూడా ఒక రేంజ్ లో పండించనున్నాడు. దీంతో రాజాసాబ్ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జె విశ్వప్రసాద్(Tj Viswaprasad)భారీ వ్యయంతో నిర్మిస్తుండగా మారుతీ(Maruthi)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ రోజు హైదరాబాద్ లోని 'ప్రసాద్ ఐమాక్స్'(I Max)వేదికగా ప్రభాస్ అభిమానుల మధ్య 'రాజాసాబ్' టీజర్ రిలీజ్ అయ్యింది. సుమారు రెండు నిమిషాల పది సెకన్ల నిడివి ఉన్న టీజర్ లో ఒక భారీ అడవి లాంటి ప్రాంతంలో చుట్టూ చెట్ల మధ్య ఉన్న ఒక ఇంటిని చూపించారు. ఆ తర్వాత వాయిస్ ఓవర్ తో 'ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం. నా తదనంతరం కూడా నేనే అనుభవిస్తాను అని చెప్పడంతో టీజర్ స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ క్యారక్టర్ ని ఎంటర్ టైన్ మెంట్ అండ్ ప్రేమ యాంగిల్ లో కూడా చూపించారు. దీన్ని బట్టి మేకర్స్ మొదట నుంచి చెప్తునట్టుగా హర్రర్ ఎంటర్ టైన్ మెంట్ కోణంలో మూవీ నడుస్తుందనే విషయం అర్ధమవుతుంది. ప్రభాస్ లుక్ కొత్తగా ఉండటంతో పాటు, డైలాగ్ డెలివరీ కూడా ఒక రేంజ్ లో ఉంది. ప్రభాస్ నోటి నుంచి వచ్చిన పలు మాటలు నవ్వులని పూయించాయి. ముఖ్యంగా టీజర్ చివర్లో తాత వైరు కొరికేసాడేమో చూడండ్రా అని ఏడుస్తూ చెప్పిన డైలాగ్ సూపర్. కొన్ని కీలక సన్నివేశాలు కూడా చూపించడంతో, చిత్ర కథ ఏమై ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. విజువల్ గా కూడా ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారనే విషయం కూడా టీజర్ ద్వారా అర్ధమవుతుంది. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక రేంజ్ లో ఉంది. డిసెంబర్ 5 న రాజాసాబ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

నిది అగర్వాల్, మాళవిక మోహనన్, సంజయ్ దత్, సముద్ర ఖని, వి టి వి గణేష్ వంటి నటులు కూడా టీజర్ లో కనపడి తమ పాత్రలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించారు. ఇక టీజర్ రిలీజ్ సందర్భంగా అభిమానులు ఐ మాక్స్ వద్ద ప్రభాస్ భారీ కట్ అవుట్ ని ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.