English | Telugu
పాపం జస్టిస్ కనగరాజ్.. అద్దె కట్టి ఫర్నిచర్ తీసుకెళ్లండి అంటున్న ఓనర్
Updated : Sep 10, 2020
అయితే ఈ విషయం పై ఫ్లాట్ ఓనర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ తమకు మొత్తం ఆరు నెలలు అద్దె కింద రూ.7 లక్షల వరకు రావాల్సి ఉండగా.. అధికారులెవరూ ఈ విషయం పై స్పందించడం లేదని వాపోయారు. అంతేకాకుండా తాము ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదని, కేవలం సాధారణ ప్రజలమని.. అద్దె చెల్లించకుండా తమను ఇబ్బంది పెట్టడం సరి కాదన్నారు. వచ్చిన అధికారులకు అగ్రిమెంట్ లెటర్ ఇచ్చి ఫర్నిచర్ తీసుకెళ్లవచ్చని చెప్పానని, వారు స్పందించకపోతే దీనిపై న్యాయస్ధానంలోనే తేల్చుకుంటామన్నారు. ఇది ఇలా ఉండగా అగ్రిమెంట్ లెటర్ ఇవ్వాలన్న రవీంద్రనాథ్ విజ్ఞప్తి గురించి ఉన్నతాధికారులకు తెలిపామని స్థానిక సిఐ చెప్పారు. దీంతో ఫర్నిచర్ కోసం వచ్చిన అధికారులు వాటిని తీసుకోకుండానే వెళ్లిపోయారు.