English | Telugu
ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షురూ!
Updated : Sep 29, 2025
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగానూ, తీవ్ర చర్చనీయాంశంగానూ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రారంభించారు. ఈ విచారణ సోమవారం (సెప్టెంబర్ 29) అసెంబ్లీ భవనంలో ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు విచారణ మొదలైంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద జరుగుతున్న ఈ విచారణకు తొలుత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తనఅడ్వకేట్లతో కలిసి హాజరయ్యారు.
ఆయన తరువాత చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు తమతమ అడ్వకేట్లతో కలిసి విచారణకు హాజరయ్యారు. అలాగే ఈ పిటిషన్లను దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్ కూడా విచారణకు హాజరౌతారు. ఎమ్మెల్యేల అనర్హత విచారణ సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆంక్షలు కూడా విధించారు. ఈ భద్రతా ఏర్పాట్లూ, ఆంక్షలూ వచ్చే నెల 6వ తేదీ వరకూ అమలులో ఉంటాయి.