English | Telugu
ధరల నియంత్రణపై నిరంతర పర్యవేక్షణ!
Updated : Apr 1, 2020
కార్పొరేటర్లు తమ డివిజన్ లలో ప్రతిరోజు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని సంబందిత అధికారుల దృష్టికి తెసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.
ప్రజలు ఇండ్ల లో ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. మార్కెట్ లు, దుకాణాలకు వెళ్ళినప్పుడు కనీస దూరం పాటించాలని మంత్రి మరోసారి విజ్ఞప్తి చేశారు.
అధికారులు ధరల నియంత్రణ కోసం నిరంతర పర్యవేక్షణ జరపాలి. పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం అందని వలస కూలీల వివరాలు తెలియజేస్తే వారికి బియ్యం నిత్యావసర వస్తువుల పంపిణీకి చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.