English | Telugu

వలస కూలీలను ఆదుకునేందుకు దాతల విరాళాలు!

మహబూబాబాద్ జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన వలస కూలీలను ఆదుకోవ‌డానికి విరాళాలు అందుతున్నాయి. లాక్ డౌన్ వల్ల ఆకలితో అలమటించకూడదని సిఎం కేసిఆర్ ఇచ్చిన పిలుపుకు మంచి స్పంద‌న వ‌స్తోంది. తెలంగాణా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ –శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కు శ్రీరామ్ ఏజన్సీస్ తరపున కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సురేష్ రావు లు 5 లక్షల రూపాయలను అందించారు.

న‌లందా డిగ్రీ కాలేజీ తరపున లక్ష రూపాయల చెక్కును కాలేజీ చైర్మన్ నూకల శ్రీరంగారెడ్డి, ప్రిన్సిపాల్ కృష్ణ ప్రసాద్, కరెస్పాండెంట్ డోలి సత్యనారాయణ అందించారు.

స్వర్ణ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంట్రాక్స్ తరపున మరో 5 లక్షల రూపాయలను సిఎం సహాయనిధికి కొంపల్లి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ రెడ్డి, సురేష్ రావులు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కు అందించారు. వీటితో పాటు ఇతర వసతులు కల్పించేందుకు కూడా ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తామన్నారు.

అందరి సంక్షేమం కోసం పాటుపడే సిఎం కేసిఆర్ గారు నేడు దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ అయ్యారని, ఇలాంటి నాయకుడు అన్ని రాష్ట్రాలకు ఉండాలని నేడే మీడియా ప్రతినిధులు, ఇతర నాయకులు చెప్పడం మనకు గర్వకారణమన్నారు. సిఎం పిలుపు మేరకు నేడు దాతలు ముందుకు రావడం సంతోషమని, మరికొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యంలో, గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.