English | Telugu

కవిత రాజీనామాపై మండలి చైర్మన్ ఏమన్నారో తెలుసా?

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా పై త్వరలో నిర్ణయం తీసుకుంటానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆమె రాజీనామాను ఇప్పటి వరకూ ఆమోదించకపోవడానికి కారణం కూడా చెప్పారు. కల్వకుంట్ల కవిత తన రాజీనామా ఆమోదించాల్సిందిగా కోరుతూ కవిత తనకు ఫోన్ చేసిందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఆమె రాజీనామాపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం గురించి వివరించారు.

పార్టీ నుంచి సస్పెండైన తరువాత కవిత భావోద్వేగంతో రాజీనామా చేసి ఉంటారని భావించాననీ, అందుకే రాజీనామా నిర్ణయంపై పునరాలోచించుకోవాలని ఆమెకు సూచించానీ గుత్తా చెప్పారు. కవిత రాజీనామాపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు.