English | Telugu
మేడారం జాతరను సందర్శించిన తెలంగాణ గవర్నర్...
Updated : Feb 7, 2020
తెలంగాణలో అతి పెద్ద జాతరైన మేడారం జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అశేష భక్తజనం మేడారం జాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మలను దర్శించుకోడానికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళి సై కూడా అమ్మవారి దర్శనార్థం ఈ రోజు మేడారం చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ మంత్రులు కొందరు నిన్న మేడారం చేరుకొని సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు బండారు దత్తాత్రేయ, అలాగే తెలంగాణ గౌవర్నర్ తమిళిసై సమ్మక్క సారలమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజురోజుకు భక్తుల తాకిడి కూడా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అంతే స్థాయిలో వారికి సదుపాయాలు కూడా అక్కడ ప్రభుత్వం కలపిస్తున్నట్లు సమాచారం. ఈ జాతరకు సంబంధించి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ తో సహా భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో అమ్మవారులని దర్శించుకోవడానికి భక్తులు సంఖ్య అధిక విచ్చేస్తున్నారు.