English | Telugu

పదవుల ఆరాటంలో రాహుల్ గాంధీని చంపేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల లీడర్లు 

కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ అనేది దేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంతేకాకుండా కాంగ్రెస్ కు వీర విధేయులం… అలాగే గాంధీ కుటుంబానికి నమ్మిన బంటులం అని చెప్పుకునే కాంగ్రెస్ సీనియ‌ర్లు తాజాగా పార్టీ అధిష్టానానికి రాసిన లేఖలో ఏకంగా రాహుల్ గాంధీని లేట్ అంటూ సంబోధిస్తూ సంచలనం రేపారు‌. గ్రూప్ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పీసీసీ పోస్ట్ రేసు జోరుగా సాగుతుంది. ఈ రేసులో అందరికంటే ముందుండాల‌న్న తాపత్రయం‌తో పాటు ఇతర నేతలకు ప‌ద‌వి దక్కకూడదనే తొంద‌ర‌లో ఏకంగా కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ నాయ‌కుడు రాహుల్ గాంధీనే చంపేశారు.

రేవంత్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లోనూ పీసీసీ పదవి ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ సీనియ‌ర్లు కొంద‌రు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి రెండు పేజీల లేఖ రాశారు. అయితే అందులో త‌మ‌ గురించి తాము గొప్ప‌గా చెప్పుకునే ప్ర‌య‌త్నంలో గ‌తంలో జ‌రిగిన కొన్ని విష‌యాలు తెలియచేస్తూ… రాహుల్ గాంధీని మ‌ర‌ణించిన వారిని సంబోధించే "Late Rahul Gandhi" అంటూ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. తమకు చేతనైతే తాము ఏం చేస్తామో చెప్పుకొని ప‌ద‌వి పొందాలి కానీ పదవుల కోసం ఇలా ఇత‌రుల‌పై బుర‌ద జ‌ల్లే కార్య‌క్ర‌మం వ‌ల్లే పార్టీ పరిస్థితి ఇలా త‌యారైంద‌ని, ఈ పేరు గొప్ప సీనియ‌ర్ లీడర్లకు రాహుల్ కు రాజీవ్ కు కూడా తేడా తెలియ‌కుండా పోయింద‌ని మండిప‌డుతున్నారు. మీ గ్రూప్ రాజ‌కీయాలతోనే తెలంగాణాలో కాంగ్రెస్ కు సమాధి కడుతున్నారని వారు మండిప‌డుతున్నారు.