English | Telugu

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం వల్ల ఎవరికి లాభం

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానంతో మద్య నిషేధం దిశగా వెళ్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆ పేరుతో మద్యానికి అలవాటు పడినవారిని పిండేయటానికి ఏర్పాట్లు చేసింది. వారి దగ్గర నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేయబోతున్నారు. అంతేకాదు నాలుగైదు బ్రాండ్ లోనే వారు తమకు కావల్సిన మద్యంను వెతుక్కోవలసి ఉంటుంది. ప్రభుత్వానికి నాలుగైదు మద్యం కంపెనీలకు కొత్త విధానం ద్వారా కిక్ వస్తువుంటే మందు బాబులకు మాత్రం ప్రభుత్వం నిజంగా కిక్కి ఇచ్చిన ఫీలింగ్ కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏది ప్రజల ఇష్టం కాదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కష్టాలెదురైతే బయటపెట్టకూడదు అలా పెడితే కేసులో అవుతాయి ఇష్టమైన న్యూస్ చానెళ్లు కూడా చూడకూడదు ఎందుకంటే వాటిని బ్యాన్ చేశారు ఇక ఇప్పుడు మందు బాబులు ఇష్టమైన బ్రాండ్ లను తాగడానికి కూడా లేదు ఎందుకంటే వాటిని ఏపీలోకి అడుగు పెట్ట కుండా చేసేశారు. ప్రభుత్వం ప్రారంభించిన మద్యం దుకాణాల్లో ఇప్పుడు నాలుగైదు రకాల బ్రాండ్లే అమ్ముతున్నారు వాటినే ఎందుకు అమ్ముతున్నారు మిగతావాట్టిని ఎందుకు అమ్మటంలేదనే విషయం ఎవరూ అడగకూడదు అడిగిన చెప్పరు. మందు బాబులు గతంలో ఏ బ్రాండ్ కు అలవాటు పడిన ఇప్పుడు ఏపీ సర్కారు ఇష్టంగా అమ్ముతున్న నాలుగు బ్రాండ్ లలో దేనికోదానికి ఫిక్స్ అవ్వాలి. అయితే దీని వెనుక ఓ స్కాం ఉందని టిడిపి నేతలు అంటున్నారు. మధ్యపానం నిషేధం ముసుగులో ఈ ప్రభుత్వం భారీ స్కామ్ స్కీ జగన్మోన్ రెడ్డి ప్రభుత్వం తెరతీసిందని చెప్పి మరి అలాగే రాష్ట్రంలో మొత్తం షాపులో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై అందులో రెన్యువల్ కానివి ఏడు వందల డెబ్బై ఏడు ఇక మిగిలిన షాపులు మూడు వేల ఆరు వందల మూడు మరి ప్రభుత్వం అంటున్నట్లు ఇరవై శాతం షాపును తగ్గిస్తే ఇంకా ఉండాల్సినవి రెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు దుకాణాల్లో మూడు వేల ఐదు వందలు దీన్ని బట్టి ప్రభుత్వం ఎంత బూటకంగా వ్యవహరిస్తోందో తెలుస్తోంది.

తప్పదు కదా అని ప్రభుత్వం తన మద్యం దుకాణాల్లో అమ్ముతున్న నాలుగైదు బ్రాండ్ లో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకుంటే పని పూర్తయిపోదు వారు చెప్పినంత ధర ఇవ్వాలి ఇప్పటికే ఇరవై శాతం మేర రేట్లు పెంచారు అంటే నిన్న మొన్నటి వరకు ఎనిమిది వందల ఉన్న బాటిల్ ధర నేడు వెయ్యి రూపాయలు దానిమీద ఎమ్మార్పీ ఎనిమిది వందలే ఉంటుంది కాని వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు. ఆ మొత్తం ఎవరి వద్దకు వెళ్తుందనే దానిపైన మందు బాబులకు చాలా సందేహాలొచ్చాయి అందుకే మొదటి రోజునే చాలా మద్యం దుకాణాల వద్ద గొడవలు జరిగాయి.ఇది కూడా ఓ స్కామేనని టిడిపి నేతలు విశ్లేషిస్తున్నారు.ఇక ప్రభుత్వం ప్రారంభించిన మద్యం దుకాణాల విషయంలోనూ ఎన్నో చిత్ర విచిత్రాలు కనిపిస్తాయి చాలా చోట్ల షాపుల అద్దె నెలకు లక్ష వరకు కడుతున్నారనే ప్రచారం జరుగుతుండగా మరి కొన్ని చోట్ల చెట్ల కిందనే దుకాణాలూ ప్రారంభించారు అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జలపల్లి అనే గ్రామంలో చెట్టు కింద బెల్టుషాపు పట్టేసినట్టుగా ఓ షాపు ప్రారంభించేశారు అక్కడి ఫొటో బయటకు వచ్చింది చాలా చోట్ల గతంలో బెల్టు షాపులు ఉన్న చోట్ల ఇఫ్పుడు పర్మినెంట్ మద్యం షాపులు ప్రారంభించేశారని చెబుతున్నారు. ప్రభుత్వం ఇరవై శాతం షాపులు తగ్గించామని చెబుతోంది. ఇలా తగ్గిస్తే ప్రభుత్వానికి ఆదాయం పడిపోవాలి కానీ రెట్టింపవుతోంది మందు బాబుల నుంచి ఈ ఏడాది ఆరు వేల కోట్ల రూపాయలు అదనంగా పిండిలా రేట్లు పెంచారు.మరోవైపు పరిమితమైన బ్రాండ్లనే అందుబాటులో ఉంచారు దీనివల్ల ఆయా కంపెనీల బిజినెస్ వందల కోట్లు పెరుగుతుంది ఆ కంపెనీల విలువ వేల కోట్లు పెరుగుతుంది. ఈ కంపెనీ యజమానులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుణ్యమా అని అపర కుబేరులు అయిపోతారు కానీ మద్యానికి అలవాటు పడిన వారు మాత్రం మొత్తానికే నిరుపేదల అయిపోతారు.ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే రాజకీయ నాయకుల తెలివితేటల గురించి సినిమాల్లో చూపించే కుట్ర కోణాలు సులువుగానే అందరికీ గుర్తుకు వస్తూ ఉంటాయి.మరి నిజంగానే అలాంటివేమైనా ఉన్నాయా లేవా అన్న దానిపై భిన్నాభిప్రాయా లున్నాయి టిడిపి నేతలు మాత్రం ఇది స్కామనే ఆరోపణలూ ఇప్పటికే ప్రారంభించారు.