English | Telugu

పాలకొల్లు ఎం.ఎల్.ఏ రామానాయుడి సైకిల్ కు బ్రేకులేసిన పోలీసులు!

పాలకొల్లు నుండి ఏలూరు వరకు రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి సైకిల్ పై ఒంటరిగా వెళ్తున్న పాలకొల్లు శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు ను పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే లు గుంపులుగా వెళ్లి ప్రారంభోత్సవలు చేసినా కళ్లప్పగించి చూసిన పోలీసులు,సైకిల్ పై వెళ్తున్న ఎం ల్ ఏ ని అడ్డుకోవటం బాధాకరమని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. కలెక్టర్, ఎస్ పీ లు ఫోన్ లిఫ్ట్ చేయని కారణంగానే, ఒంటరిగా తన నియోజకవర్గానికి బయల్దేరానని రామానాయుడు చెపుతున్నా, పోలీసులు ఆయన్ను ముందుకు వెళ్ళడానికి అనుమతించలేదు.