English | Telugu

గుండెపోటుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి

విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే, శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో మృతి చెందారు. జనార్ధన్‌‌కు గుండెపోటు రావడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు.

2019 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగాలని జనార్దన్ ప్రయత్నించారు. టీడీపీ తరపున కురుపాంలో నామినేషన్ కూడా వేశారు. అయితే, కుల వివాదంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది.