English | Telugu
ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు! సీఎం, డీజీపీలకు చంద్రబాబు లేఖ
Updated : Dec 29, 2020
రాష్ట్రంలో వైసీపీ నేతలు భయానక పరిస్థితులు నెలకొల్పారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. తాడిపత్రిలాంటి ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా జరగకుండా చూడాలని ఆయన కోరారు. విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మేల్కొనాలని చంద్రబాబు నాయుడు అన్నారు. జేసీ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వాటిల్లినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తిస్థాయిలో జేసీ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని, ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా నిందితులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు.