English | Telugu

టార్గెట్ రోజా.. అనితకు కీలక బాధ్యతల వెనుక బాబు వ్యూహం!

తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత నియమితులయ్యారు. మొన్నటి వరకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో దళిత వర్గానికి చెందిన అనితను నియమిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట రావు స్పందిస్తూ.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై వంగలపూడి అనిత సారధ్యంలో తెలుగు మహిళలు పోరాటం చేస్తారని పేర్కొన్నారు.

వంగలపూడి అనితకు కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా లక్ష్యంగా అనితకు కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. టీడీపీలో అనిత ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. గతంలో అసెంబ్లీలో రోజా టీడీపీ పైన విమర్శలు చేసిన సమయంలో అనిత ధీటుగా స్పందించేవారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో రోజా దూకుడు మరింత పెంచారు. దీంతో రోజా వంటివారికి ధీటుగా మాటలతో సమాధానం చెప్పాలంటే.. అనితానే కరెక్ట్ అని భావించిన చంద్రబాబు.. ఆమెకి కీలక బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.