English | Telugu

పవన్ తో పాటే మిగితా పార్టీలు... వైజాగ్ లాంగ్ మార్చ్

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పై రేపు ఛలో విశాఖపట్నం లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇసుక కొరత కారణంగా లక్షలాది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వామపక్షాలు, బిజెపి, టిడిపి స్పందించి ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాయి. నవంబర్ 3న విశాఖ లో పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న లాంగ్ మార్చ్ కు అన్ని పార్టీలు మద్దతు తెలిపి అందులో పాల్గొనాలని ఆయన కోరారు.రెండు రోజుల క్రితం ఏపీలోని అన్ని పార్టీల అధ్యక్షులకు.. కార్యదర్శులకు.. ఫోన్ చేసి వారి మద్దతు కోరారు పవన్ కళ్యాణ్. దాదాపు అన్ని పార్టీలు నిర్మాణ రంగ కార్మికుల సమస్యపై జనసేన తల పెట్టిన లాంగ్ మార్చ్ కు సంఘీభావం తెలపడం జరిగింది.

జనసేన చేపట్టబోయే కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకారం తెలిపారు బిజెపి నాయకులు కన్నా లక్ష్మినారాయణ. అయితే జనసేన చేస్తున్న ఈ కార్యక్రమంలో కన్నా పాల్గొనాల్సిన అవసరం లేదని బిజెపి ఏపి ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ప్రకటించారు. విష్ణువర్ధన్ మాటలను బట్టి చూస్తే పవన్ ఆందోళన బీజేపీలో విబేధాలు సృష్టించినట్లే అంటున్నారు బీజేపీ కార్యకర్తలు. ఒక్కరు విభేదించినంత మాత్రాన మా మద్దతు మారదు.. చివరిగా మేము సంఘీభావానికి పరిమితం కానున్నట్లు తెలిపాయి బీజేపీ వర్గాలు.

ఋజువు చెయ్యలేని మిత్రబంధం తెలుగుదేశం-జనసేన అంటూ వైసిపి నాయకులు ఎప్పటి నుండో ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో కనుక టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొంటే మనఃసాక్షి అంటూ ఇటీవల వైసీపీ చేసిన ఆరోపణలకు కొంత బలం చేకూరుతుందని ఊహిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. వామపక్షాలు మొన్నటి ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేశాయి గనుక ధర్నాలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ ధర్నా వైసీపీ ప్రభుత్వం మీద ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అనేదే రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.