English | Telugu
పాత తరాల కన్నీటి బిందువుల్ని వజ్రాలుగా మూటగట్టి
Updated : Oct 6, 2020
అలాంటి మరో సజీవ చిత్రణ 'వీరయ్య'. కడుపు చేత్తో పట్టుకుని ఓడెక్కిన రైతు కూలీలు దేశాంతరాలు తమ రక్తమాంసాలని... ఆ చెరుకుతోటలకి ఎరువుగాను తమ కన్నీటిని నీరుగాను....తమ చెమటను చెరుకుగడకి తీపిగాను ఎక్కించిన తీరు..!
కదిలిపోతాం ...మనకి తెలియకుండానే... గుండె చిలకబడి అది కళ్ళ గుండా... చెమ్మగిల్లి... నిశ్శబ్దంగా చెక్కిళ్ళ మీదనించి ధారలుగా జారుతుంది !
మన ముత్తాత ఫోటో సంపాదించడమే అసాధ్యం అయ్యే ఈ రోజుల్లో... రచయత కృష్ణ తన మూలాన్ని వెతుక్కుంటూ చరిత్రపుటల్లోకి... తవ్వుకుంటూ వెళ్ళిపోయి... అక్కడినించి... ఘనీభవించిన... తమ పాత తరాల కన్నీటి బిందువుల్ని వజ్రాలుగా మూటగట్టి... 'వీరయ్య'గా మన ముందు పరిచాడు.
అందుకే కొన్ని సంఘటనలు కఠినంగా మెరుస్తూ వుంటాయి ! ఈ పుస్తకం... ఏకబిగిన చదవకండి ! గుండె తట్టుకోలేదు..! కన్నీరు ఇంకి పోతుంది..! ఊపిరి కూడా ఆగిపోవచ్చు..!! అంచెలంచలుగా చదివి...అనుభూతి చెందండి..!
ఈ పుస్తకం వల్ల...మనకి రెండు విషయాలు తెలుస్తాయి..!
ఒకటి... మనిషి మీద సాటి మనిషి క్రౌర్యం..!
రెండు, ఒక మనిషి... కష్టాలకు ఎదురొడ్డి ! మానవ జాతికంతటికీ కాంతివంతమైన ఒక దీపస్తంభమై నిలబడ్డం !!
-ఆత్మీయంగా,
తనికెళ్ళ భరణి
వీరయ్య పుస్తకాన్ని కొని చదివి ఆనందించండి
India – 275 INR - https://amazon.in/dp/8194427339
USA – 7.50 $ - https://www.amazon.com/dp/8194427339