English | Telugu
వ్యవసాయ చట్టాలపై మోదీ కీలక వ్యాఖ్యలు.. క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి
Updated : Dec 18, 2020
వ్యవసాయ చట్టాలను రాత్రికి రాత్రే తీసుకురాలేదని.. గత 20,30 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం గురించి చర్చించాయని అన్నారు.దేశంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, రైతు సంఘాలు ఈ వ్యవసాయ సంస్కరణలను కోరుకున్నారని మోదీ పేర్కొన్నారు. కొందరి రాజకీయ పునాదులు కూకటి వేళ్లతో సహా కదులుతున్నాయి కాబట్టే.. కొన్ని పార్టీలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
వ్యవసాయ సంస్కరణలు జరగడం ప్రతిపక్షాల బాధ కాదని, ఇన్నాళ్ల పాటు తాము చేయని మంచి పని మోదీ చేశారు కాబట్టే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మోదీ అన్నారు. ఇంత మంచి సంస్కరణలు మేం ఎందుకు ప్రవేశపెట్టలేకపోయామని, ఆ ఘనత మోదీకే ఎందుకు దక్కాలని తమను తాము ప్రశ్నించుకుంటున్నారు అన్నారు. "అలాంటి వాళ్లకు నా సమాధానం ఒక్కటే. నాకు ఎలాంటి క్రెడిట్ వద్దు. మొత్తం మీరే తీసుకోండి. రైతుల అభివృద్ధే మాకు ముఖ్యం. దయచేసి రైతులను తప్పుదోవ పట్టించకండి" అని ప్రధాని మోదీ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.