English | Telugu

జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో ఎదురు దెబ్బ

ఎపి సర్కార్ కు మూడు రాజధానుల విషయంలో సుప్రీం కోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. మూడు రాజధానుల చట్టం, సీఆర్డీఏ చట్టం రద్దు పై హైకోర్టు విధించిన స్టేటస్ కో ఎత్తి వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పెటిషన్ ను కోర్టు ఈరోజు కొట్టివేసింది. హైకోర్టు ఇచిన స్టేటస్ కో ఉత్తర్వుల పై విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే ఈ విష్యం పై హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టులో రేపే విచారణ ఉన్నందున సుప్రీం కోర్టు వద్దకు రావడం సరికాదని స్పష్టంచేసింది. నిర్ణీత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. హైకోర్టుకు తాము గడువు విధించలేమని కోరుతు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు ఈ కేసును త్వరగా పరిష్కరిస్తుందని తాము ఆశిస్తున్నామని ధర్మాసనం తెలిపింది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశం పై మళ్లీ హైకోర్టులోనే తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.