English | Telugu

ముస్లిం 4% రిజ‌ర్వేష‌న్ కేసు మార్చి 16కు వాయిదా!

2004 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ముఖ్యమంత్రి అయిన త‌రువాత‌ రాష్ట్రములోని అణ‌గారిన ముస్లిం వర్గాలకు బిసి(ఇ) క్యాట‌గిరి పేరుతో రిజ‌ర్వేష‌న్లు ఇచ్చారు.

ముస్లిం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ద్రోహద పడేలా రిజర్వేషన్ కల్పించడము అత్యవసరమని భావించి 4% రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ ఫలితంగా ముస్లిం సమాజము విద్య ,మరియు ఉపాధి రంగాలలో గణనీయమైన ప్రాధాన్యత పొందింది.

అయితే మత ప్రాతిపదిక పై రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాలు చేస్తూ, ఉమ్మడి రాష్ట్రము హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేయగా అప్పటి రాష్ట్ర హైకోర్టు సదరు కేసును కొట్టివేయడము జరిగింది. ఆ దరిమిలా సదరు కేసును కొంతమంది తిరిగి సుప్రీం కోర్టులో కేసును దాఖలు చేశారు 2010లో డాక్టర్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి గారి చొరవతో ఆ కేసును వాయిదా వేయించడం జరిగింది (స్టే తీసుకుని రావడం )అప్పటి నుండి ఆ stay నేటి వరకు కొనసాగుతుండగా, విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లిం సమాజం 4% రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారు.

ఈ కేసు సుప్రీంకోర్టులో మార్చి 3వ తేదీన బెంచ్‌పైకి వ‌చ్చింది. ఈ కేసును మార్చి 16, 2020 వాయిదా వేస్తున్న‌ట్లు ఉన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌క‌టించింది.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు హుటాహుటిన ఢిల్లీకి పంపారు. ఆయ‌న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆర్ వెంకటరమని ,మరియు జయదీప్ గుప్తాలతో ప్రత్యక్ష సమాలోచనలు జరిపి ఈ కేసుకు సంబంధించి చ‌ర్చించారు. ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన రిజర్వేషన్ కేసును తప్పనిసరి గా గెలవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డిప్యూటీ సి.ఎం. ఆశాభావం వ్య‌క్తం చేశారు.