English | Telugu
దశాబ్దాల కాలం నాటి అయోధ్య కేసుకు తెర పడబోతోందా?
Updated : Oct 16, 2019
అయోధ్యలో బాబ్రీ మసీదు విషయం లో హిందువులు ముస్లింల మధ్య శతాబ్ద కాలానికిపైగా వివాదం నడుస్తోంది.పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందువులు మసీదును కూలగొట్టడంతో ఈ వివాదం పెద్దదైంది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన అల్లర్లలో దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది చనిపోయారు. ఆ సంఘటన తర్వాత అయోధ్యలోని భూమిపై వివాదం నడుస్తోంది. ఈ కేసును అలహాబాద్ హై కోర్టు విచారించింది.
రెండు వేల పది సెప్టెంబర్ ముప్పైన తీర్పు ప్రకటించింది. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించారని అలహాబాద్ హై కోర్టు తీర్పిచ్చింది .ఈ మూడు భాగాల్లో ఒక భాగం హిందూ మహాసభ ప్రాతి నిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.అలహాబాద్ హై కోర్టు రెండు వేల పది సెప్టెంబర్ లో ఇచ్చిన తీర్పులో మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. వివాదాస్పద భూభాగం రాముడి జన్మస్థలమని చెప్పింది.
అక్కడున్న ఒక దేవాలయాన్ని కూల్చేసిన తరవాత మసీదు నిర్మించారని పేర్కొంది. ఆ మసీదును ఇస్లాం సూత్రాలకు అనుగుణంగా నిర్మించలేదని తీర్పులో వ్యాఖ్యానించింది. ఈ తీర్పు పై ఇరువర్గాల సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు, దీంతో సుప్రీం కోర్టు అలహాబాద్ హైకోర్ట్ తీర్పును సస్పెండ్ చేసింది.సుప్రీం కోర్టులో ఈ కేసును తుది దశకు చేరుకుంది.
ఎట్టకేళ్ళకు అయోధ్య భూ వివాదం విచారణ ఇవాళ ముగియనుంది. సుప్రీం కోర్టు ఈ కేసులో వాదనలను ఇవాళ మధ్యాహ్నంలోగా ముగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.దీనికి సంబంధించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ సూచనప్రాయంగా తెలియచేసింది.హిందూ ముస్లిం పక్షాలు తమ తమ అభిప్రాయాల్ని సమర్పించటానికి సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇచ్చే అవకాశం ఉంది.
ముప్పైతొమ్మిది రోజుల నుంచి సుప్రీం కోర్టు ఇరుపక్షాల వాదనలు వింటోంది. తొలుత అక్టోబర్ పధ్ధెనిమిదివ తేదీనాటికల్లా విచారణ పూర్తి చేయాలనుకుంది. ఆ తర్వాత అందుకు ఒక రోజు ముందే అంటే పదిహెడువ తేదీన తుది గడువుగా పెట్టుకుంది.ఇప్పుడు అంతకంటే ముందే ఇవాళ విచారణని పూర్తి చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది.
అయోధ్యలోని రామజన్మభూమి వద్ద మసీదును నిర్మించడం ద్వారా మొఘల్ చక్రవర్తి బాబర్ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారంటూ మహన్ సురేష్ దాస్ అనే హిందూ పిటిషనర్ తరపు న్యాయవాది పరాశరన్ మంగళవారం సుప్రీం కోర్టు ఎదుట తన వాదనని వినిపించారు. అయోధ్యలో పలు మసీదులున్నాయని అక్కడ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని అయితే హిందువులు మాత్రం శ్రీరాముడి జన్మస్థలాన్ని మార్చలేరని అన్నారు.
అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వానికి తావు లేదని సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించడం మంచిదని ఇండియన్ ముస్లీమ్స్ ఫర్ పీస్ అనే సంస్థ చేసిన ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు.ఈ మాటను ఆ సంస్థ మధ్యవర్తిత్వం సాగుతున్న సమయంలో ఇచ్చి ఉండాల్సిందని ఇప్పుడు ఆ గడువు మించిపోయిందని చెప్పారు.
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ పదిహెడున రిటైర్ కానున్నారు ఈ నేపథ్యంలో ఈ కేసు నవంబర్ నాలుగు నుంచి పదిహేనులోగా తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ నవంబర్ పదిహెడవ తేదీలోగా చీఫ్ జస్టిస్ గొగోయ్ తీర్పు ప్రకటించలేకపోతే ఆ అంశాన్ని కొత్త ధర్మాసనం విచారిస్తోంది.
సుప్రీంకోర్టు వివాదాస్పద భూమి ఎవరికి చెందుతుందనే అంశంపై తీర్పు నివ్వనుంది.ఆ భూమి ఎవరికి చెందుతుంది ఏ భాగం ఎవరికి లభిస్తుందని అంశంమ్మీద స్పష్టతనిస్తూ సిజెఐ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది.
అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును కూడా రాజ్యాంగ ధర్మాసనం సమర్థించవచ్చు.అలాగే అన్ని పక్షాలకు ఉత్తమమని తాను భావించిన విధంగా ఆ భూభాగాన్ని రాజ్యాంగ ధర్మాసనం విభజించే అవకాశం కూడా ఉంది.తీర్పు వెలువరించే రోజు అయిదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం మీదకొచ్చి తీర్పులో తాము రాసిన భాగాన్ని ఒక్కొక్కరిగా చదివి వినిపిస్తారు.సిజిఐ స్వయంగా తీర్పు చదవడం ప్రారంభించే అవకాశం కూడా ఉంది.
అయితే అయోధ్యపై వేసిన పిటిషన్ను సున్నీ వక్ఫ్ బోర్డ్ విత్ డ్రా చేసుకుంటుందన్న ఒక కీలక మలుపు కూడా వినిపిస్తోంది.మొత్తానికి దశాబ్దాల కాలానికి చెందిన ఈ కేసుకు నేటితో తెర పడబోతోంది. ఏమి జరగబోతోందో వేచి చూడాలి.