English | Telugu

వైసీపీ పరువు తీసిన బీజేపీ సీనియర్ నేత

కొద్ది రోజుల క్రితం ఎన్డీయేలో చేరాలని వైసీపీని బీజేపీ ఆహ్వానించినట్లు.. దీంతో ఇక సీఎం జగన్ నిర్ణయమే పెండింగ్ అనే స్థాయిలో మీడియాలో విపరీతంగా చర్చ జరిగిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా దీని పై ఒక నిర్ణయానికి వస్తారని కూడా చర్చ జరిగింది.

అయితే దీనిపై తాజాగా స్పందించిన ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దియోధర్.. అవినీతి తో నిండిపోయిన వైఎస్ఆర్ సిపి తో తమకు ఎటువంటి పొత్తు ఉండబోదని వ్యాఖ్యలు చేసారు. తమ ప్రయాణం జనసేన పార్టీ తోనే అని తేల్చి చెప్పిన అయన జగన్ పార్టీ ఎన్డీయేలో చేరబోతోంది అనేవి కేవలం గాలి వార్తలని ఆయన పేర్కొన్నారు.