English | Telugu

కమల్ హాసన్ తల నరికేస్తానంటున్న ప్రముఖ నటుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

కమల్ హాసన్ తల నరికేస్తానంటున్న ప్రముఖ నటుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

Publish Date:Aug 11, 2025

యూనివర్సల్ స్టార్ 'కమల్ హాసన్'(Kamal Haasan)ఇటీవల ప్రముఖ హీరో 'సూర్య'(Suriya)స్థాపించిన 'అగరం' ఫౌండేషన్(Agaram Foundation)లో జరిగిన వార్షికోత్సవ వేడుకలకి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులని ఉద్దేశించి కమల్ మాట్లాడుతు 'నియంతృత్వం, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది. ఈ యుద్ధంలో గెలవాలంటే వేరే ఏ ఆయుధాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఆ విధంగా మీరు గెలవలేరు. మెజారిటీ మూర్ఖులు మిమ్మల్ని ఓడిస్తారు. జ్ఞానం ఓడిపోతుందని మాట్లాడటం జరిగింది. కమల్ మాట్లాడిన ఈ మాటలపై రీసెంట్ గా ప్రముఖ తమిళ టివి నటుడు 'రవిచంద్రన్'(Ravi Chandran)మాట్లాడుతు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన కమల్ హాసన్ ని చంపేస్తానని, తల నరికేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ మాటలు తమిళనాట సంచలనంగా మారాయి. ఇక కమల్ అభిమానులతో పాటు, మక్కల్ నీది మయ్యం' పార్టీ కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్ లలో రవిచంద్రన్ పై ఫిర్యాదు చేసారు. రవిచంద్రన్ పై చర్యలు తీసుకొని ఇక ముందు ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యకుండా చూడాలని కోరుతున్నారు.  రవిచంద్రన్ సుదీర్ఘ కాలం నుంచి పలు రకాల సీరియల్స్ లో చేస్తు మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ' పాండియన్ స్టోర్స్'(Pandian Stores)సీరియల్ రవిచంద్రన్ కి ప్రత్యేక గుర్తింపుని ఇచ్చింది. సెంథిల్ అనే క్యారక్టర్ ద్వారా ప్రతి ఇంటికి ఎంతగానో చేరువయ్యాడు. 'మక్కల్ నీది మయ్యం' పార్టీ అధ్యక్షుడి హోదాలో కమల్ హాసన్ ఇటీవల అధికార డిఎంకె పార్టీ మద్దతుతో రాజ్యసభకు ఎంపిక అయ్యాడు. ఆ హోదాలోనే అగరం ఫౌండేషన్ కి హాజరై, సనాతన దర్మంపై కీలక  వ్యాఖ్యలు చేసాడు.     
After UBS, Harish Shankar to join SVC again

After UBS, Harish Shankar to join SVC again

Publish Date:Aug 9, 2025

Following the completion of his highly anticipated film Ustad Bhagat Singh with Pawan Kalyan, director Harish Shankar is set to collaborate with Sri Venkateswara Creations (SVC) for his next project. This marks a significant reunion for the director with the production house, for whom he previously helmed blockbusters like Subramanyam For Sale and Duvvada Jagannadham. According to the makers, the upcoming film will be a lavishly mounted, pan-India production featuring a major star. The project is described as an exciting venture for the banner and a celebrated homecoming for the director. Details regarding the star cast, title, and other key crew members are being kept under wraps for now, with an official announcement expected at an appropriate time. Currently, Harish Shankar is busy with production and post production works of Ustad Bhagat Singh. The shoot of this huge film will conclude by end of September and there are chances for the film to release in Summer or even for Sankranti next year, as per the best available date. Mythri Movie Makers are producing it. 

ఆ సినిమా చూసి చరణ్‌రాజ్‌ను గ్యాంగ్‌ రేప్‌ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చిన మహిళ!

Publish Date:Aug 8, 2025

సినిమా రంగంలో ఎవరి కెరీర్‌ ఎప్పుడు ఎలా టర్న్‌ తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. కన్నడ చిత్రరంగంలో హీరోగా పలు సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించిన చరణ్‌రాజ్‌.. తెలుగులో ‘ప్రతిఘటన’ చిత్రంతో విలన్‌గా పరిచయమయ్యారు. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూసిన విలన్లకు భిన్నంగా చరణ్‌రాజ్‌ కనిపించారు. చరణ్‌రాజ్‌ అసలు పేరు బ్రహ్మానంద. కాలేజీలో చదివే రోజుల్లోనే అతనికి హీరో అవ్వాలన్న కోరిక ఉండేది. అయితే అతని ఫ్రెండ్స్‌ మాత్రం ఎగతాళి చేసేవారు. ఎప్పటికైనా తాను సినిమా హీరో అవుతానని వారితో ఛాలెంజ్‌ చేసి 1982లో ‘పరాజిత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు చరణ్‌రాజ్‌. ఈ సినిమా తర్వాత దాదాపు 20 సినిమాల్లో హీరోగా నటించిన ఆయనకు 1985లో ఉషాకిరణ్‌ మూవీస్‌ నుంచి పిలుపొచ్చింది. టి.కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ‘ప్రతిఘటన’ చిత్రంలో విలన్‌గా నటించమని అడిగారు. కన్నడలో హీరోగా కొనసాగుతున్న తనకి విలన్‌గా చేయడం ఇష్టం లేక రెండు నెలలపాటు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత కొందరు మిత్రుల సలహాతో ఒప్పుకున్నారు. అప్పటివరకు కన్నడలో మీసాలు లేని హీరోగా సినిమాలు చేస్తూ వచ్చిన చరణ్‌రాజ్‌.. ‘ప్రతిఘటన’ కోసం గడ్డం, మీసాలు పెంచాల్సి వచ్చింది. ఈ విషయంలో టి.కృష్ణ ఎంతో కేర్‌ తీసుకొని కాళిదాసు గెటప్‌ని అద్భుతంగా క్రియేట్‌ చేశారు. 1985 అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సినిమాలో విజయశాంతికి ఎంత పేరు వచ్చిందో.. విలన్‌గా నటించిన చరణ్‌రాజ్‌కి కూడా అంతే పేరొచ్చింది. అతని నటనకుగాను ఉత్తమ విలన్‌గా నంది పురస్కారం లభించింది. ‘ప్రతిఘటన’లాంటి సినిమా తన కెరీర్‌లో మరొకటి రాలేదని చెప్తారు చరణ్‌రాజ్‌. ఈ సినిమా చేస్తున్న సమయంలో, రిలీజ్‌ తర్వాత తనకు ఎదురైన అనుభవాల గురించి 1991లో ఒక పత్రిక ద్వారా తెలిపారు.  ‘ప్రతిఘటన’ను ఒక సాధారణ చిత్రంగానే భావించాను. సినిమాలో నా క్యారెక్టర్‌ ఎలా బిహేవ్‌ చేస్తుంది, కొన్ని క్లిష్టమైన సీన్స్‌లో ఎలా నటించాలి అనేవి టి.కృష్ణగారు నాకు చేసి చూపించేవారు. ఆయన చెప్పింది చేసేవాడ్ని తప్ప ఆ క్యారెక్టర్‌ని అంతగా అడాప్ట్‌ చేసుకోలేకపోయాను. విజయశాంతిని రేప్‌ సీన్‌, ‘ఈ దుర్యోధన.. దుశ్శాసన..’ పాట, రాజశేఖర్‌తో ఫైట్‌ చేసి చంపటం.. ఇలా కృష్ణగారు ఆ సీన్స్‌ గురించి చెప్పినప్పుడు అవన్నీ జోక్స్‌లా అనిపించాయి. డైరెక్టర్‌ మనసులోని భావాలు నాకు అర్థం కాలేదు. కానీ, తెరమీద ఆ సీన్స్‌ చూసినపుడు, ప్రేక్షకులు వాటికి రెస్పాండ్‌ అయిన తీరు చూసి నేను షాక్‌ అయ్యాను. అవి చేసింది నేనేనా అని ఆశ్చర్యపోయాను.  ఇక విజయశాంతిగారి గురించి చెప్పాలంటే.. ఆమె నవ్వులో పసితనం, కళ్లల్లో అమాయకత్వం కనిపిస్తుంది. అలాంటి అమ్మాయిని రేప్‌ చేసే సీన్‌ పర్‌ఫెక్ట్‌గా చెయ్యగలనా అనుకున్నాను. అయితే ఆ సీన్‌ ఓకే అయింది. క్లైమాక్స్‌లో నాకు సన్మానం జరిగే సమయంలో నన్ను అభినందించడానికి వచ్చి నా ఎదురుగా నిలబడితే షాక్‌ అయ్యాను. నేను చూస్తున్నది విజయశాంతినా, రaాన్సీరాణినా లేక భద్రకాళినా అనే ఫీలింగ్‌ కలిగింది. ఆ షాక్‌ నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైమ్‌ పట్టింది. ఎంతో ప్రశాంతంగా కనిపించే ఆమె.. ఆ సీన్‌లో అలా ఎలా మారిపోయింది అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.  ‘ప్రతిఘటన’ నా కెరీర్‌నే మార్చేసింది. ముఖ్యంగా తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. అయితే కాళి లాంటి క్యారెక్టర్‌ మళ్లీ నాకు రాలేదు. ఒకవేళ వచ్చినా అంత బాగా నాతో చేయించగలరా, నేను అంత ఎఫెక్టివ్‌గా చెయ్యగలనా అనిపిస్తుంది. ఆ సినిమా చేసిన తర్వాత నన్ను అభినందిస్తూ ఎంతో మంది ఉత్తరాలు రాశారు. కాళి తరహా పాత్ర మళ్లీ చెయ్యాలని కోరారు. ఈ అభినందనలు అన్నీ ఒక ఎత్తయితే.. అదే సమయంలో నాకు మరో ఉత్తరం వచ్చింది. అయితే అది నాకు రాలేదు. ఉషాకిరణ్‌ మూవీస్‌ ఆఫీస్‌కి వచ్చింది. ఆ ఉత్తరాన్ని అట్లూరి రామారావుగారు నాకు చూపించారు. ఆ ఉత్తరాన్ని ఒక మహిళ రాసింది. అది చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. ‘చరణ్‌రాజ్‌ ఒక అమ్మాయిని రేప్‌ చేశాడు. అసలు అంత దారుణానికి ఎలా పాల్పడతాడు? వాడు మనిషేనా? అతన్ని మా దగ్గరికి పంపించండి. మా లేడీస్‌ అందరం కలిసి అతన్నే భయంకరంగా రేప్‌ చేస్తాం’ అని ఆ ఉత్తరంలో ఉంది. అది చదివిన తర్వాత నిజంగానే నా మీద దండయాత్రకు వస్తారేమో అని భయం వేసింది. ఎందుకంటే నాకు స్వతహాగా లేడీస్‌ అంటే కాస్త జంకు, ఒక విధమైన భయం. నా మనస్తత్వానికి విరుద్ధమైన పాత్రలు సినిమాల్లో చాలా చేశాను. ‘ఇంత సాఫ్ట్‌గా ఉండే మీరు అంతటి క్రూరమైన విలన్‌గా ఎలా చెయ్యగలుగుతున్నారు’ అని నా భార్య కూడా చాలా సార్లు అడిగింది’ అంటూ తన కెరీర్‌లోని కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి తెలిపారు చరణ్‌రాజ్‌. 

ఏడాది పాటు గదిలో బంధించాడు.. అమీర్ ఖాన్ పై సోదరుడు ఫైజల్ ఖాన్ ఆరోపణ    

Publish Date:Aug 9, 2025

బాలీవుడ్ స్టార్ హీరోల్లో 'అమీర్ ఖాన్'(Aamir Khan)కూడా ఒకరు. నాలుగు దశాబ్దాలపై నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో చేస్తు, ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. జూన్ 20 న 'సితారే జమీన్ పర్'  తో  వచ్చి  మరోసారి భారీ విజయాన్ని అందుకున్న అమీర్, ఈ నెల 15 న 'కూలీ' ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  రీసెంట్ గా అమీర్ ఖాన్ సోదరుడు 'పైజల్ ఖాన్'(faissal Khan)మాట్లాడుతు కొన్ని విషయాల్లో నేను నా కుటుంబానికి సహకరించలేదు. దీంతో నేను మానసిక వ్యాధికి గురయ్యానని, పిచ్చివాడినని, సమాజానికి హాని  చేస్తానని అన్నారు. ఆ విధంగా నేను ఉచ్చులో కురుకుపోయానని అర్థమైంది. దాన్నుంచి ఎలా బయటపడాలో అర్ధం కాలేదు. 'అమీర్ 'నన్ను ఏడాది పాటు గదిలో బంధించాడు. ఫోన్ లాగేసుకొని గది బయట బాడీ గార్డ్ లని పెట్టారు. నా తండ్రి నన్ను కాపాడతాడని అనుకున్నాను. కానీ నా తండ్రితో ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు. గతంలో మానసిక ఆరోగ్యం మెరుగు కోసం ట్రీట్ మెంట్ తీసుకున్నాను. కొన్ని రోజుల చికిత్స అనంతరం నార్మల్ గా అయ్యాను. అయినా కూడా అమీర్ నన్ను బంధించాడని ఫైజల్ చెప్పుకొచ్చాడు. మూడేళ్ళ వయసులోనే బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఫైజల్, 1994 లో సోలో హీరోగా 'మధోష్'అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పరాజయం చెందింది. ఆ తర్వాత అమీర్ హీరోగా చేసిన కొన్ని చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించాడు. అమీర్, ఫైజల్  తండ్రి పేరు తాహిర్ హుస్సేన్(Tahir Hussain)నిర్మాతగా, నటుడిగా, దర్శకుడిగా, రైటర్ గా భారతీయ చిత్ర పరిశ్రమకి తన సేవలని అందించాడు. 2010 లో చనిపోవడం జరిగింది. ఆస్థి విషయంలో ఫైజల్ గత కొంత కాలంగా 'అమీర్' పై కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నాడు.     

 పెళ్లికి ఒప్పుకున్న గంగ.. పెద్దసారుని అడ్డుకున్న రౌడీలు!

Publish Date:Aug 9, 2025

జీ తెలుగులో  ప్రసారమవుతున్న సీరియల్'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-24 లో..... తన తల్లి హాస్పిటల్ ఖర్చు ఎలా తీసుకొని రావాలని గంగ టెన్షన్ పడుతుంటే.. వీరు మనిషి వచ్చి ఇంజక్షన్ కి డబ్బు కడతాడు. అది చూసి ఇతనే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందని గంగకి చెప్తాడు పైడిరాజు. నేను మిమ్మల్ని మొదటిసారి చూసి ఇష్టపడ్డాను.. మీకు ఇష్టం అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది.. మీ అమ్మ కిడ్నీ మార్చడానికి కూడా డబ్బు ఇస్తానని వీరు మనిషి చెప్పగానే మా అమ్మ కంటే ఏది ముఖ్యం కాదని, నాకు ఈ పెళ్లి ఇష్టమే అని గంగ అంటుంది. నా మీద ఒట్టేసి చెప్పమని పైడిరాజు అడుగగా.. గంగ ఒట్టేసి చెప్తుంది. మరొకవైపు వీరుకి తన మనిషి ఫోన్ చేసి.. గంగ పెళ్లికి ఒప్పుకుందని చెప్తాడు. వీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకు అంత హ్యాపీ అని తన భార్య అడుగుతుంది. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా పర్మిషన్ వచ్చిందని అంటాడు. ఏం బిజినెస్ అని తను అడుగుతుంది. అప్పుడే ఇషిక వచ్చి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అని కవర్ చేస్తుంది. ఇద్దరం కలిసి ప్లాన్ చేసామని ఇషిక అంటుంది. అవును తన సపోర్ట్ వల్లే సక్సెస్ అయ్యానని వీరు అంటాడు. మరొకవైపు గంగ పెళ్లి కూతురులాగా రెడీ అవుతుంది. తన ఫ్రెండ్స్ కి మా అమ్మ కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నానని చెప్తుంది. అది వాళ్ళ అమ్మ విని గంగ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఇందుమతి గంగ గురించి మాట్లాడుతుంటే శకుంతల వచ్చి.. భాను అను అంటుంది. వాళ్ళ అమ్మకి ఎలా ఉందో ఏంటో ఒకసారి వెళ్ళొస్తే బాగుండు అని శకుంతల అనగానే.. నేను వెళ్ళొస్తానని వీరు అంటాడు. అవసరం లేదు నేను వెళ్ళొస్తానని పెద్దసారు వంశీని తీసుకొని వెళ్తుంటాడు. అప్పుడే రుద్ర ఎదురు పడతాడు. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ అయితే వచ్చెయ్యండి అని రుద్ర చెప్తాడు. మరొకవైపు ఇప్పుడు ఈయన వెళ్తే అక్కడ గంగ గురించి తెలుస్తుందని వీరు, ఇషిక అనుకుంటారు. వీరు మనిషికి ఇషిక ఫోన్ చేసి అక్కడికి మా మావయ్య వస్తున్నాడు.. రాకుండా ఆపు అని చెప్తుంది. దాంతో పెద్దసారు ఇంట్లోకి వెళ్లకుండా రౌడీలు అడ్డకుంటారు అలాగే పైడిరాజు గొడవపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ భారీ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Publish Date:Aug 7, 2025

  ఇండియన్ సినిమాలో గత కొన్నేళ్లుగా పలు భారీ మల్టీస్టారర్ లు వస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకున్న 'వార్-2' ఈ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'రామాయణ'లో రణబీర్ కపూర్, యశ్ కలిసి నటిస్తున్నారు. త్వరలో అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో కూడా ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశముందని తెలుస్తోంది.   'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటిన హోంబలే ఫిలిమ్స్.. అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను రంగంలోకి దింపాలని చూస్తోందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని, అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.   ప్రస్తుతం అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, ప్రశాంత్ నీల్ ముగ్గురూ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అట్లీతో బన్నీ ఓ భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. షారుఖ్ చేతిలో 'కింగ్' మూవీ ఉంది. నీల్ కూడా ఎన్టీఆర్ తో 'డ్రాగన్' అనే భారీ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ల తర్వాత.. వీరి కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ కు హోంబలే ఫిలిమ్స్ శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి.   ఈ మల్టీస్టారర్ సాధ్యమైతే మాత్రం.. కేవలం ప్రకటనతోనే సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక విడుదల తర్వాత ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమని చెప్పవచ్చు.  

Hansika Motwani indirectly confirms divorce rumors?

Publish Date:Aug 5, 2025

Hansika Motwani rose to stardom with Telugu film Deshamuduru. The beautiful lady became a rage among youth and she earned even more popularity in Tamil Cinema. She got married to Sohael Khaturiya in December 2022. The couple have released their wedding drama as a video on OTT platform, too.  Sohael being husband of Haniska's close friend, before their marriage, she even faced homewrecker tags. But Hansika stayed strong in her decision to get married to him. Recently, the rumors have been aplenty that the couple have separated and are applying for divorce.  Adding to fuel to all rumors, she deleted all her wedding photos and vidoes. Even all her photos with Sohael, on her Instagram page. This is being reported as an indirect confirmation about her divorce. Neither she nor Sohael have given any public statement but reports suggest that the couple are irreconcilable.  The actress became a Judge on TV shows like Dhee and she has been busy with several movie projects too. Earlier, Hansika had been in a relatioship with Silambarasan aka Simbu and after a public break-up, she announced her relationship with Sohael and even before three years, the couple are heading towards divorce.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

కింగ్‌డమ్

Publish Date:Jul 31, 2025

జూనియర్

Publish Date:Jul 18, 2025

Kingdom

Publish Date:Jul 31, 2025

Mahavatar Narsimha

Publish Date:Jul 25, 2025

Hari Hara Veera Mallu

Publish Date:Jul 24, 2025

Junior

Publish Date:Jul 18, 2025

Oh Bhama Ayyo Rama

Publish Date:Jul 11, 2025