English | Telugu
దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ టీఆర్ఎస్ నాయకుడు..
Updated : Oct 8, 2020
శ్రీనివాస్‌రెడ్డి మంగళవారమే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దుబ్బాక లో టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా సోలిపేట సుజాతను ఎన్నికల బరిలోకి దింపుతుండగా, బీజేపీ రఘునందనరావు పేరును ప్రకటించింది. అయితే, టీఆర్ఎస్ నుండి దుబ్బాక టికెట్‌ను ఆశించి భంగపడిన శ్రీనివాస్‌రెడ్డి ఆ పార్టీ వదిలి కాంగ్రెస్‌లో చేరగా, వెంటనే ఆయనకు కాంగ్ర్రెస్ టికెట్ ఖరారు కావడం విశేషం. దీంట్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.