English | Telugu
విజయవాడ ఘటన పై బాబు మౌనం అందుకే.. వైసీపీ ఫైర్
Updated : Aug 10, 2020
మీ పార్టీకి సంబంధించిన వాళ్లు తప్పు చేస్తే ఒకరకంగా.., ఇతరులు చేస్తే మరో రకంగా స్పందించడం మీ నైజం అని ఎద్దేవా చేస్తూ.. మీ నైజాన్ని బయటపెట్టేందుకే మా పార్టీ పయత్నిస్తోంది అని అన్నారు. ఒక పార్టీకి అధ్యక్షుడుగా, ప్రతిపక్ష నేతగా పనిచేసే వ్యక్తి ఇలా పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదని.. అన్నిటికి అతీతంగా వ్యవహరించినప్పుడే మనం నాయకులం అవుతాం. ఐతే అలాంటి ఉద్దేశం మీకు ఏ కోశానా లేదు. నీకు తెలిసిందల్లా ప్రతిదానికీ కుల రాజకీయాలు చేయడమే. తప్పు చేసిన వారిని శిక్షించినా కూడా కుల ప్రస్తావన తీసుకువస్తావు. నీ స్వంత పార్టీ వాళ్లే బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలపైన దాడిచేసినా అందుకు ప్రభుత్వాన్నే తప్పు పడతావు. నువ్వు ఈ రెండు నాల్కల ధోరణి మానుకోవాలి అంటూ బాబు పై ఫైర్ అయ్యారు. రాష్ట్ర నడిబొడ్డున విజయవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై మాత్రం ఎందుకు మాట్లాడవు అని శ్రీకాంత్ రెడ్డి బాబును ప్రశ్నించారు. ఈ ప్రమాదంలో ఫలానా వ్యక్తులది తప్పు అని ఎందుకు ఒక్క మాటా మాట్లాడడం లేదని అయన చంద్రబాబును నిలదీశారు.