English | Telugu

అమరావతి పై ఏపీ బీజేపీ ఫుల్ క్లారిటీ

పార్టీ నేతలకు ఫుల్ క్లారిటీ ఇస్తున్న కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు

ఒక పక్క అమరావతికి తమ పార్టీ అనుకూలం అంటూనే, మరోపక్క ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అమరావతికి అనుకూలంగా బీజేపీ లో ఏ నాయకుడు మాట్లాడినా రాష్ట్ర బీజేపీ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వస్తోంది. మొన్న మూడు రాజధానుల విషయంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ పార్టీ నాయకుడు రమణ ఒక ప్రముఖ పత్రికలో వ్యాసం రాశారని పార్టీ నుండి సస్పెండ్ చేయగా, తాజాగా అదే పార్టీకి చెందిన వెలగపూడి గోపాలకృష్ణ ని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది.

తాజాగా రాజధాని ఏర్పాటుతో సంబంధం లేదని కేంద్రం అఫిడవిట్ లో తెలపడం భావ్యం కాదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధానితో కేంద్రానికి సంబంధం లేనప్పుడు అని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఇచ్చారు అని వెలగపూడి గోపాలకృష్ణ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుండి రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ వైఖరికి నిరసనగా తన చెప్పుతో తనే కొట్టుకున్నారు. దీంతో వెంటనే రాష్ట్ర బీజేపీ అధిష్టానం వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.

దీంతో అమరావతి పై బీజేపీ వైఖరి స్పష్టం అయిందని.. అది పైపైకి అమరావతి కి అనుకూలంగా అంటూనే.. లోపల మాత్రం వ్యతిరేకంగా పని చేస్తోందని ప్రస్తుత పరిణామాలను బట్టి క్లియర్ గా అర్ధమవుతోంది అని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.