English | Telugu
సార్ మీరే మాకు ఇన్స్పిరేషన్.. చంద్రబాబు కాంప్లిమెంట్స్ కు సోను సూద్ జవాబు
Updated : Jul 27, 2020
తాజాగా ఏపీలోని చిత్తూర్ జిల్లాకు చెందిన ఒక పేద రైతు కుటుంబం ఆర్ధిక సమస్యల కారణంగా కన్న కూతుళ్లు కాడి పట్టి నాగలి లాగుతుండగా వెనుక తల్లి, తండ్రి విత్తనాలు వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఎంతో మంది చూసి చలించిపోయారు. కానీ ఎవరు స్పందించలేదు. కానీ ఇదే వీడియోను చూసిన సోనుసూద్ మాత్రం ఆ పేద రైతుకు సాయం చేస్తానని ప్రకటించిన 24 గంటల్లోనే కొత్త ట్రాక్టర్ పంపించారు.
తాజాగా పేద రైతుకు సోనూసూద్ చేసిన సాయం పై ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రశంసిస్తూ ఇది అందరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అంతే కాకుండా దళిత పేద రైతు అయిన నాగేశ్వరరావు కుమార్తెల చదువుల బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు చేసిన ఈ ప్రశంసకు సోనూసూద్ మీరు మాకు స్ఫూర్తి అంటూ రిప్లై ఇచ్చారు. అంతే కాకుండా త్వరలోనే మిమ్మల్ని కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నానని అయన అన్నారు.