English | Telugu

పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించండి : కేంద్రానికి చంద్రబాబు లేఖ

లాక్ డౌన్ కారణంగా తీవ్ర కష్టాలు, సమస్యలు ఎదుర్కొంటున్న పోగాకు రైతులపై దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు పొగాకు బోర్డు చైర్మన్ కు రాసిన లేఖలో రాష్ట్రంలో 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగిందనీ, అయితే దీనిని అమ్ముకునే వెసులుబాటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ పేర్కొన్నారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.

జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి పొగాకు ఉత్పత్తి చేశారు. కానీ కరోనా సమస్యతో కొనుగోళ్లు నిలిచిపోవటంతో ఆ రైతులు పడుతున్న మనోవేదన వర్ణనాతీతం. అలాగే ఇతర పంటలు సాగుచేసిన రైతు కూడా తమ కష్టార్జితాన్ని కొనుగోలు చేసే నాథుడు లేక లబోదిబోమంటున్నారు.