English | Telugu

అమెరికాలో మొదలైన పోలింగ్.. కానీ మరోపక్క ఎందుకో భయం..!

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికాలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కొద్దీ సేపటి క్రితం పోలింగ్ మొదలైంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు ఎంతో ఉత్కంఠతో చూస్తున్నాయి. అయితే అమెరికాలో మాత్రం వ్యాపారస్తులు.. మాత్రం తమ షాపులను అల్లరి మూకల బారి నుండి రక్షించుకునే పనిలో తలమునకలై ఉన్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే అమెరికాను కరోనా వైరస్ కుదిపేసిన సంగతి తెలిసందే. దీంతో లక్షలాది మంది ప్రజలు మరణించారు. అంతేకాకుండా కోట్లాది మంది అమెరికన్లు ఉద్యోగాలు కూడా కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఒక పక్క కరోనా మహమ్మారి సృష్టించిన సమస్యల మధ్య అమెరికన్లు తమ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అమెరికాలో జరుగుతున్న ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి. దీంతో మరోసారి అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడం కోసం ట్రంప్ దేశ వ్యాప్తంగా పర్యటించి, మరోసారి జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే డెమొక్రటిక్ నేత జో బైడెన్ మాత్రం కరోనా విషయంలో ట్రంప్ ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ఎత్తిచూపే ప్రయత్నం చేసారు..

ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున అల్లర్లు.. లూటీలు జరగొచ్చని అమెరికాలో పుకార్లు బయలుదేరాయి. దీంతో అమెరికాలోని వ్యాపారస్తులు తమ వాణిజ్యసముదాయాలను రక్షించుకునే పనిలో పడ్డారు. అమెరికాలోని పలు ప్రధాన నగరాల్లోని వాణిజ్య సముదాయాల యజమానులు తమ షాపులకు ఫ్లైవుడ్‌తో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయించుకుంటున్నారు. ఒకవేళ నిరసనకారులు రాళ్లు రువ్వినా దాని వల్ల ఎటువంటి నష్టం కలగకుండా కీటికీలను, డోర్‌లను ఫ్లైవుడ్‌తో మూసివేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.