English | Telugu

మీరు దావూద్ ఇబ్రహీంకు కూడా సెక్యూరిటీ ఇస్తారు.. కేంద్రంపై శివసేన ఫైర్

సుశాంత్ సింగ్ రాజపుత్ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కేంద్ర హోంశాఖ వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకు పడ్డారు. సాక్షాత్తు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కూడా రక్షణ కల్పిస్తారని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్నిఎద్దేవా చేశారు. ఒకవేళ అండర్ వరల్డ్ డాన్ దావూద్ కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం కనుక మాట్లాడితే... రేపే దావుద్ కు కూడా కేంద్రం రక్షణ కల్పిస్తుందని అయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి కేంద్రం ఏమైనా చేస్తుందని అయన మండిపడ్డారు. ఒకపక్క ఉత్తరప్రదేశ్, బీహార్ లలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మహిళా కమిషన్ కు పట్టవని ప్రతాప్ సర్నాయక్ విమర్శించారు. అదే సమయంలో ముంబై పోలీసులను నమ్మని వ్యక్తులకు మాత్రం కేంద్రం భద్రత కల్పిస్తుందని అయన అన్నారు. మంబైని పీఓకేతో పోల్చిన కంగనా పై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని అయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.