English | Telugu

గుండెపోటుతో ప్రముఖ నటి, సింగర్, బిగ్ బాస్ కంటెస్ట్ మృతి

సల్మాన్ ఖాన్(Salman Khan)అక్షయ్ కుమార్(Akshay Kumar)ప్రియాంక చోప్రా వంటి బడా కాస్టింగ్ కలిసి చేసిన చిత్రం 'ముజ్ సే షాదీ కరోగి'. 2004 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో 'బిజిలి' అనే అతిధి పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందిన నటి 'షెఫాలీ జరీవాలా'(Shefali Jariwala). అదే సంవత్సరం నమిత హీరోయిన్ గా తెలుగులో వచ్చిన 'ఐతే ఏంటి' చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలోను చేసింది.


ముంబై(Mumbai)లో ఉంటున్న 'షెఫాలీ' నిన్న రాత్రి గుండెపోటుకి గురయ్యింది. దీంతో తీవ్ర అస్వస్థతకి లోనవ్వడంతో తుది శ్వాస విడిచింది. ఊహించని ఈ సంఘటనతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. 2002 లో వచ్చిన కాంటా లగా అనే వీడియో ఆల్బమ్ తో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించింది. ఆ ఆల్బమ్ కారణంగానే 'ది థాంగ్ గర్ల్' అని అభిమానుల చేత పిలువబడింది. ఆ తర్వాత ఎన్నో ఆల్బమ్స్ చేసి తన అభిమాన గణాన్ని రెట్టింపు చేసుకుంది. పలు సీరియల్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించిన పెషాలి, హిందీ బిగ్ బాస్ 13 వ సీజన్ లో కంటెస్ట్ గా పాల్గొంది.

2004లో మీట్ బ్రదర్స్‌కు చెందిన సంగీతకారుడు హర్మీత్ సింగ్‌తో షెఫాలీ వివాహం జరిగింది. ఆతర్వాత మనస్పర్థలతో 2009లో ఆ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. తదనంతరం 2015లో నటుడు 'పరాగ్ త్యాగి' ని వివాహం చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ షెఫాలీ స్వస్థలం. ఆమె వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు


అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.