English | Telugu

Shakhahaari OTT: ఓటీటీలోకి శాఖాహారి మూవీ.. ఆశ్రయం కోసం వచ్చిన వ్యక్తి మరణిస్తే!

 Shakhahaari OTT: ఓటీటీలోకి శాఖాహారి మూవీ.. ఆశ్రయం కోసం వచ్చిన వ్యక్తి మరణిస్తే!

ఓ కొండ ప్రాంతంలో చిన్న హోటల్.. అందులో రెగ్యులర్ గా శాఖాహారం మాత్రమే వండే సుబ్బన్న. చుట్టుప్రక్కల అంతా అతనికి మంచి పేరు.. అలాంటి వ్యక్తి దగ్గరకి ఓ వ్యక్తి ఆశ్రయం కోసం వస్తే, అతడి వల్ల సుబ్బన్న ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వంచిందనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో సాగే కథే ' శాఖాహారి( Shakhahaari)'. 

తెలుగు సినిమాలతో  పాటు ఇతర భాషా చిత్రాలని మన తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు. ఓటీటీలోకి కొన్ని ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చి భారీగా వీక్షకాధరణ పొందతున్నాయి. ఫోరెన్సిక్, అన్వేషిప్పన్ కండేతుమ్, బ్రహ్మయుగం లాంటి  ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే కోవలోకి కన్నడ మూవీ వచ్చేసింది. అదే 'శాఖాహారి'. కన్నడలో రూపొందిన ఈ సినిమాకి సందీప్ దర్శకుడు. రంగాయన రఘు సినిమాలో కీలక పాత్ర పోషించాడు. గోపాలకృష్ణ దేశ్ పాండే,  వినయ్, నిధి హెగ్డే తదితరులు నటించారు. మర్డర్ మిస్టరీలో ఈ మూవీని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్బ లో ఈ వారమే అడుగుపెట్టగా అత్యదిక వీక్షకాధరణ లభించింది. కోటిరూపాయలలోపు బడ్జెతో నిర్మించిన ఈ 'శాఖాహారి' అక్కడ థియేటర్లలో భారీ వసూళ్ళను రాబట్టుకుంది.  

సూపర్ సస్పెన్స్ తో పాటు ట్విస్ట్ లతో సాగే ఈ శాఖాహారి మూవీ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేయ్యండి. అయితే ఈ మూవీ నెల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడలో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ ఓటీటీ నుండి ఈ ఓటీటీకి తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీకెండ్ కి ఈ థ్రిల్లర్ ని చూసేయ్యండి మరి.