English | Telugu

ముంబై హీరోయిన్ విషయంలో భారీగా చేతులు మారిన డబ్బు...డీల్ ఎంత! 

సినిమా రంగంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలని నిత్యం ఎంతో మంది తారలు ఇండస్ట్రీలో అడుగుపెడుతుంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు ఆషా జెత్వానీ. తెలుగుతో పాటు కొన్ని హిందీ చిత్రాలలోను చేసింది. ఇప్పుడు ఈమెకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

ఆషా జెత్వానీ ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. కృష్ణా జిల్లాకి చెందిన వైసీపి పార్టీ కి చెందిన ఒక అగ్ర నాయకుడు కుమారుడు ఆషా ని గతంలో ఒక పార్టీలో కలిసాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో లొంగ దూసుకొని కొన్నాళ్ళు చెట్టాపట్టా లేసుకొని తిరిగారు. ఇక ఆ తర్వాత తనని పెళ్లి చేసుకోవాలని సదరు వైసిపీ నాయకుడు కుమారుడు ని కోరింది. దాంతోమాట్లాడుకుందామని ఆషా ని విజయవాడకు పిలిపించాడు. ఆ తర్వాత ఒక గెస్ట్‌హౌస్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు గా వార్తలు వస్తున్నాయి. ఇది నిజమని కొన్ని చానెల్స్ లో అధికారకంగా న్యూస్ కూడా వస్తుంది.

ఇక కొన్ని రోజుల క్రితం ప్రముఖ రాజకీయనాయకుడు, పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందిన ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆషా కొన్నాళ్ల కిందట ముంబయిలో ఓ కేసు పెట్టినట్లు గా తెలుస్తోంది. దీంతో తన కొడుకుతో పెళ్లి ప్రతిపాదనను విరమించుకోవాలని ఆషా కి చెప్పి చూశాడట. అయినా సరే ఆమె వినకపోవడంతో బెజవాడ పిలిపించి వేధించినట్లుగా సదరు ఛానల్ పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ముంబయిలో సెటిల్‌ చేస్తే తన ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని భావించిన ఆ పారిశ్రామికవేత్త, గత వైసిపీ ప్రభుత్వ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాలరీత్యా వారి సాయం కోరినట్లు మరో ప్రచారం సైతం ఉంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరు అని,డీల్ ఇంతకీ మాట్లాడుకున్నారనే చర్చ అందరిలో మొదలయ్యింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.