English | Telugu

పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ కరోనా బారినపడ్డాడు. వైద్య పరీక్షలలో అఫ్రిదీకి కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని శనివారం సోషల్ మీడియా ద్వారా అఫ్రిదీ తెలిపాడు.

"గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఒళ్లంతా ఒకటే నొప్పులు. కరోనా టెస్టులు చేయించుకున్నా. దురదృష్టవశాత్తూ కరోనా పాజిటివ్‌గా తేలింది. త్వరగా కోలుకోవడానికి అల్లా దయ, మీ ఆశీస్సులు కావాలని కోరుతున్నాను" అంటూ అఫ్రిదీ ట్వీట్ చేశాడు.