English | Telugu
సీనియర్ జర్నలిస్టు పొత్తూరి కన్నుమూత
Updated : Mar 5, 2020
సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సొంతింట్లోనే తుది శ్వాస విడిచారు. తెలుగు పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా పొత్తూరి సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గానూ పనిచేశారు.
పొత్తూరి వెంకటేశ్వరరావు 1934, ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలోని పొత్తూరులో జన్మించారు. 1957లో ఆంధ్రజనత పత్రికలో చేరి పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టారు. తర్వాత ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ తదితర పత్రికల్లో పని చేశారు. పొత్తూరి అనేక పుస్తకాలు కూడా రచించారు. 2000 సంవత్సరంలో ఆయన రాసిన 'నాటి పత్రికల మేటి విలువలు' పుస్తకం, 2001లో విడుదలైన చింతన, చిరస్మరణీయులు పుస్తకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.