English | Telugu
తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్
Updated : Nov 20, 2020
సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం గ్రేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు గట్టి షాక్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికలో ఘోర ఓటమిని చవిచూసింది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల వేళ సీనియర్లు పార్టీని వీడడం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ ని వీడారు. ఫైర్ బ్రాండ్ విజయశాంతి సైతం కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. మరో నేత కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.