English | Telugu

భారీగా పతనమౌతున్న రూపాయి, డాలర్‌తో 75 రూపాయ‌ల రికార్డ్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ఆస్టేలియా క‌రెన్సీ 6 రూపాయ‌లు త‌గ్గింది. లండ‌న్ పౌండ్ 8 రూపాయ‌లు త‌గ్గింది. కెన‌డా 4 రూపాయ‌లు త‌గ్గింది. అయితే డాల‌ర్‌, దిర్హ‌మ్‌, రియాల్ రేట్లు మాత్రం పెరుగుతూ పోతున్నాయి. ఇండియ‌న్ రూపాయితో పోల్చితే ఒక డాల‌ర్‌కు ఇండియాకు చెందిన 75 రూపాయ‌లు. రిటైల్ మార్కెట్‌లో 76 రూపాయ‌ల‌కు ఒక డాల‌ర్ ఇస్తున్నారు. అలాగే దిర్హ‌మ్ రేటు 19 రూపాయ‌ల 20 పైస‌ల నుంచి 20 రూపాయ‌ల‌కు చేరింది. అలాగే సౌదీ రియాల్ 19 రూపాయ‌ల 45 పైస‌ల నుంచి 20 రూపాయ‌ల 20 పైస‌ల‌కు పెరిగింది.

కరోనా వైరస్, క్రూడాయిల్ ప్రైస్ వంటి అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి బలహీనపడుతోంది. డాలర్ మారకంతో 70 పైసలకు పైగా క్షీణించి రూ.74.96 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు ఉదయం రూ.74.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం ముగింపు రూ.74.26గా ఉంది. అంటే గురువారం దాదాపు రూ.75ను టచ్ అయింది. ఇది 80 రూపాయ‌ల వ‌ర‌కు వెళుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఫారన్ పోర్ట్‌పోలియేఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్ల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. కరోనా భయాలతో FPIలు వెనక్కి వెళ్ళడం రూపాయి బలహీనానికి ముఖ్య కారణాల్లో ఒకటి. మార్చి నెలలో ఇప్పటి వరకు రూ.70,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఓవర్సీస్ ఇన్వెసట్టర్లు ఈక్విటీల నుండి రూ.36,200 కోట్లు, డెట్ సెగ్మెంట్ నుండి రూ.32,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. కరోనా, అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి.