English | Telugu

రోజా రెడ్డి వెర్సెస్ పెద్ది రెడ్డి

చిత్తూరు జిల్లాలో ప్రచ్ఛన్న యుద్ధం
రోజా రెడ్డి కి చెక్ పెడుతున్న పెద్ది రెడ్డి
మంత్రి పదవి పై కన్నేసిన రోజా
రోజా మంత్రి అయితే సుధీర్ఘ కాలం కాపాడుకున్న పెద్దరికం పోతుంది అనే భయంలో పెద్ది రెడ్డి

గాలి వానలా మొదలైన రోజా రెడ్డి ,పెద్ది రెడ్డి ప్రచ్చన్న యుద్ధం తుఫాను గా మారుతుంది.జిల్లా లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.జగనన్న గెలిస్తే చెల్లమ్మకు మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారంతా.కానీ చెల్లెమ్మకు మంత్రి పదవి దక్కకుండా పెద్ది రెడ్డి చాకచక్యంగా చక్రం తిప్పారు.చెల్లెమ్మ అలిగి కొన్ని రోజులు బయటకు రావడం కూడా మానేసి జబర్దస్త్ కి పరిమితం అయ్యారు.ఏపిఐఐసి పదవి తీసుకోవడం ఇష్టం లేకపోయినా సన్నిహితుల సలహాతో పదవి స్వీకారం చేసినా ఆ పదవి పట్ల ఆమె ఎప్పుడు శ్రద్ద చూపడం లేదు.ఒక పక్క కోరుకున్న పదవి దక్కలేదు అని ఆవేదన మరో పక్క నియోజికవర్గంలో అంతర్గత పోరు ఆమెకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.నియోజికవర్గంలో ఒక చోటా నాయకుడి జన్మదిన వేడుకులకు హాజరవ్వొద్దని ఎమ్మెల్యే రోజా కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే జిల్లాలో పెద్ది రెడ్డి ప్రాభవం ఎంత ఉందొ అర్ధం చేసుకోవచ్చు.ఆఖరికి సొంత నియోజికవర్గంలో పర్యటించడానికి లేదంటూ పెద్ది రెడ్డి వర్గం ఆమె కాన్వాయ్ కి అడ్డుపడే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దారుణమైన పరిస్థితి,జబర్దస్త్ కష్టాలు రోజాను వెంటాడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ఈ సమయంలో మండలి రద్దు రోజాలో కొత్త ఆశలు రేకెత్తించాయి.రెండు మంత్రి పదవులు ఖాళీ అవ్వడం,రేసులో రోజా పేరు మీడియా లో రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకొని మంత్రి పీఠం దక్కించుకోవాలని రోజా రెడ్డి ఆలోచన.మరి పెద్ది రెడ్డి ఊరికే చూస్తూ కూర్చుంటారా?జిల్లాలో మరో పవర్ సెంటర్ అనే ఆలోచనే రాకూడదు ఆయనకి.వెంటనే రంగంలోకి దిగి నగరి లో తన వర్గానికే మెజారిటీ సీట్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు.ఈ లోపు లేడీ సెంటిమెంట్ వాడి రోజా కార్చిన కన్నీటికి అధిష్టానం కాస్త తగ్గి కొంత భాగం సీట్లు ఆమె వర్గానికి వచ్చేలా చేసారు.ఇప్పుడు పెద్ది రెడ్డి వర్గం దీనికి విరుగుడు వేసింది.ఈ నియోజికవర్గంలోకి రోజా హవా జీరో చెయ్యాలని తద్వారా ఆమె మంత్రి పదవి ఆశల పై నీళ్లు చల్లాలని పెద్ది రెడ్డి ఫిక్స్ అయ్యారు.అందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సైలెంట్ గా ఓట్లు గుద్ది రోజా ని జీరో చెయ్యాలని ఆర్డర్ వేసారు పెద్దిరెడ్డి.ఇప్పుడు ఎం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో రోజా పెద్ది రెడ్డి ని ఎదుర్కునే శక్తి లేక ఢీలా పడ్డారు.